ముకేశ్ అంబానీకి గట్టి షాక్ ఇచ్చిన కేంద్రం...

By Sandra Ashok KumarFirst Published Dec 22, 2019, 11:14 AM IST
Highlights

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి గట్టి షాక్ తగులనున్నది. రిలయన్స్ సంస్థలో 25 శాతం వాటాను సౌదీ చమురు సంస్థ ఆరామ్ కోకు విక్రయించాలన్స ముకేశ్ అంబానీ నిర్ణయానికి కేంద్రం అడ్డుకట్ట వేసినట్లు సమాచారం. 

ముంబై: దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్‌ సంస్థ రిలయన్స్‌ ఇండిస్టీస్‌కు (ఆర్‌ఐఎల్‌) ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచ చమురు రంగంలో పాగా వేయాలనుకుంటున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానికి షాక్‌ తగలనున్నది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన రిఫైనరీ, పెట్రో కెమికల్‌ వ్యాపారంలో 25 శాతం వాటా కొనుగోలు చేయాలని భావించిన ప్రపంచంలోనే అతి పెద్ద చమురు సంస్థ, సౌదీ ఆరామ్‌కోకు భారత ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది.

also read సవాళ్లను ఢీకొట్టే కార్పొరేట్ పాలనకు మారుపేరు మహీంద్రా

రిలయన్స్ వాటాను సౌదీ అరామ్ కో కొనుగోలు చేయకుండా భారత ప్రభుత్వం అడ్డుకున్నట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక వార్తను ప్రచురించింది. ఆర్‌ఐఎల్‌ తన వాటాను సౌదీ కంపెనీకి విక్రయించే ముందు ఆ సంస్థ చెల్లించాల్సిన బకాయిలను క్లియర్‌ చేయాలని సర్కార్ కోరినట్టుగా సమాచారం. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బ్రిటిష్‌ గ్యాస్‌పై కొనసాగుతున్న కోర్టు కేసు విచారణలో భాగంగా భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పత్రిక వెల్లడించింది. 

ఇంకా పన్నా-ముక్తా, తపతి ఫీల్డ్‌లలో ఉత్పత్తి పంపకం విషయమై అంతర్జాతీయ ఆర్బెట్రేషన్‌ కేసు ఉంది. దాదాపు 4.5 బిలియన్‌ డాలర్ల విలువైన ఈ కేసులో తుది తీర్పులు వెలువడాల్సి ఉంది. ఈ కేసు అంశం ఎటూ తేల్చకుండా ఆర్‌ఐఎల్‌ భారీ స్థాయిలో వాటాను ఆరామ్‌కోకు విక్రయించాలని ప్రతిపాదించడాన్ని ప్రభుత్వ వర్గాలు సీరియస్‌గా తీసుకున్నాయి. 

ఇప్పటికే తమ కంపెనీ ఆస్తులను వెల్లడిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని రిలయన్స్ డైరెక్టర్లను కేంద్ర ప్రభుత్వం కోరిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుపై ఢిల్లీ హైకోర్టు 2020 ఫిబ్రవరి ఆరో తేదీన విచారణ చేపట్టనున్నట్టు ఆ పత్రిక పేర్కొంది. గతంలోనే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన రిఫైనరీ, పెట్రో కెమికల్స్‌ వ్యాపారంలో మైనారిటీ (25 శాతం)వాటా కోసం సౌదీ ఆరామ్‌కో కంపెనీ 1,000–1,500 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నదని వార్తలు వచ్చాయి. రిలయన్స్‌ ఇండిస్టీస్‌ ఇప్పటికే దాదాపు రూ.2.88 లక్షల కోట్ల మేర భారీ రుణాలను తీసుకున్నది.

also read గూగుల్ సి‌ఈ‌ఓ సుందర్ పిచాయ్ జీతం ఎంతో తెలుసా....?

ఈ నేపథ్యంలో ఆ సంస్థ 25 శాతం ఆస్తులను విక్రయించాలన్న రిలయన్స్ అవార్డు అమలుకు అనుమతిలిచ్చేందుకు సర్కారు ఎలా అనుమతులివ్వగలదని కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్‌లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. ఈ వార్తలపై స్పందించడానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నిరాకరించింది. మార్కెట్‌ ఊహాగానాలపై స్పందించడం తమ విధానం కాదని పేర్కొంది. ప్రభుత్వం నిర్ణయంపై రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి.
 

click me!