నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించనున్న గూగుల్

Ashok Kumar   | Asianet News
Published : Dec 23, 2019, 05:54 PM ISTUpdated : Dec 23, 2019, 06:02 PM IST
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించనున్న గూగుల్

సారాంశం

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారులకు మరియు కస్టమర్లకు సపోర్ట్  కోసం గూగుల్ మిస్సిస్సిప్పి (యుఎస్), ఇండియా మరియు ఫిలిప్పీన్స్ దేశాలలో మొత్తం 3,800 కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలను కల్పించనుంది.  

గూగుల్ సంస్థ ఇప్పుడు  తమ యూసర్లకు, కస్టమేర్లకు కస్టమర్ సపోర్ట్ కోసం మిస్సిస్సిప్పి (యుఎస్), ఇండియా, ఫిలిపిన్స్ దేశాలలో కొత్తగా 3,800 ఉద్యోగా అవకాశాలను కల్పించనుంది.ఇంతకుముందు కస్టమర్ల, వినియోగదారుల సపోర్ట్ కోసం కాల్స్‌కు సమాధానం ఇవ్వడం, ప్రాడక్ట్ ట్రబుల్షూటింగ్, క్యాంపైన్ సెటప్ వంటివి సాధారణంగా గూగుల్ తరపున థర్డ్ పార్టీ కంపెనీలు చేసేవాని ఒక బ్లాగ్‌పోస్ట్ లో గూగుల్ తెలిపింది.

also read 2019 Round Up: ఎండాకాలంలో వాటికి డిమాండ్...టీవీలు, ఓవెన్లకు నో రెస్పాన్.. కానీ..

2018లో, గూగుల్ సంస్థ ఓ పైలట్ ప్రోగ్రామ్‌ ద్వారా కస్టమర్ మరియు యూజర్ సపోర్ట్‌ను పెంచే ఈ ఉద్యోగాల కల్పనను ప్రకటించింది." పైలట్ ప్రోగ్రామ్‌లో మాకు లభించిన గొప్ప ఫీడ్‌బ్యాక్ ఆధారంగా, మేము ఈ ఉద్యోగాలు కల్పించడాన్ని విస్తరిస్తున్నాము.

 2020 చివరి నాటికి, మా గూగుల్‌ ఆపరేషన్ సెంటర్స్ (జిఓసి)లో ఇప్పటికే పనిచేస్తున్న 1,000 గూగుల్ కస్టమర్ సపోర్ట్ ఏజెంట్‌లతో సహా ఇప్పుడు మొత్తం 4,800 కంటే ఎక్కువ గూగుల్ కస్టమర్ సపోర్ట్ జాబ్‌లను సృష్టించాము." అని గూగుల్ ఆపరేషన్స్ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ ట్రాయ్ డికర్సన్ ఓ బ్లాగులో చెప్పారు.

also read 2020లో కొత్త ఉద్యోగులను తీసుకునే అవకాశాలు తక్కువే...కారణం ?

గూగుల్  కేంద్రాల్లోని ఏజెంట్లు మూడు వారాల పెడ్ లీవ్స్, 22 వారాల పెడ్ పేరెంట్స్ లీవ్, మరియు ఆరోగ్య సంరక్షణ (వైద్య, దంత మరియు కంటి చూపు సంబంధించి) ప్రయోజనాలను పొందుతారు. ఏజెంట్లు పనిలో ఉన్నప్పుడు  ఉచిత భోజన సౌకర్యం కలిగి ఉంటారని బ్లాగ్ ద్వారా తెలిపింది .

PREV
click me!

Recommended Stories

2026 AI Impact : ఎవరి ఉద్యోగం సేఫ్.. ఎవరిది డేంజర్? నిపుణుల విశ్లేషణ ఇదే !
YouTube : యూట్యూబ్ నుంచి లక్షలు సంపాదించవచ్చు ! ఈ 5 టిప్స్ పాటిస్తే సక్సెస్ పక్కా !