కరోనా ఎఫెక్ట్‌ : గూగుల్‌ ఉద్యోగులకు ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూలు..!

By Sandra Ashok KumarFirst Published Mar 10, 2020, 2:14 PM IST
Highlights

కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా గూగుల్ అన్ని ఇంటర్వ్యూలను గూగుల్ హ్యాంగ్అవుట్స్ లేదా బ్లూజీన్స్‌కు తరలించబోతున్నట్లు గూగుల్  పేర్కొంది. 

 కరోనావైరస్ కారణంగా గూగుల్ అన్ని ఉద్యోగ ఇంటర్వ్యూలను ఇకపై ఉద్యోగం కోసం వచ్చే అభ్యర్థులకు తమ క్యాంపస్‌లలో ఫేస్‌ టు ఫేస్‌ కాకుండా ఆన్‌లైన్‌లో వర్చువల్‌గా ఇంటర్వ్యూలు చేయనుంది. ఈ మేరకు గూగుల్‌ ఒక ప్రకటనను విడుదల చేసింది. 

అమెజాన్, ఫేస్ బుక్ కూడా ఆన్-సైట్ జాబ్ ఇంటర్వ్యూలను కూడా పరిమితం చేశాయి. కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా గూగుల్ అన్ని ఇంటర్వ్యూలను గూగుల్ హ్యాంగ్అవుట్స్ లేదా బ్లూజీన్స్‌కు తరలించబోతున్నట్లు గూగుల్  పేర్కొంది.

also read  ముకేశ్ అంబానీ బీట్ చేసిన అలీబాబా అధినేత...ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా జాక్ మా

ఈ విషయాన్ని కొత్తగా ఉద్యోగ ఇంటర్వ్యూ కోసం వచ్చే వారికి గూగుల్ సిబ్బంది బృందం ఒకరికి పంపిన ఇమెయిల్ లో  తెలిపింది. "కరోనావైరస్ వ్యాప్తి కారణంగా  ఉద్యోగ ఇంటర్వ్యూలకు వచ్చే అభ్యర్థులు, ఇంటర్వ్యూయర్ల ఆరోగ్య శ్రేయస్సును కాపాడటానికి, మేము అన్ని గూగుల్ ఇంటర్వ్యూలను ప్రపంచవ్యాప్తంగా గూగుల్ హ్యాంగ్అవుట్స్ లేదా బ్లూజీన్స్‌కు తరలించి నిర్వహిస్తాము," అని గూగుల్ ఒక  ఇ-మెయిల్‌లో చెప్పారు. 

కరోనావైరస్ వ్యాప్తి దృష్ట్యా ఆన్-సైట్ ఇంటర్వ్యూలను రద్దు చేసింది గూగుల్ మాత్రమే కాదు. ఫేస్ బుక్ కూడా చాలా మందికి ఉద్యోగ ఇంటర్వ్యూలను రద్దు చేయనున్నట్లు తెలిపింది.

also read విదేశాల్లో రాణా కపూర్ ఫ్యామిలీ ఆస్తులు... యెస్ బ్యాంకు స్కాంపై సీబీఐ పరిశోధన...

అమెజాన్ ఆన్-సైట్ జాబ్ ఇంటర్వ్యూలను నిలిపివేసింది. కరోనావైరస్ వ్యాప్తిని నివారించడంలో భాగంగా గూగుల్ అనేక చర్యలు తీసుకుంది. గూగుల్ క్యాంపస్‌లను చూసేందుకు వచ్చే సందర్శకులను కూడా ఇకపై క్యాంపస్‌లలోకి అనుమతించబోమని గూగుల్‌ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. 

కరోనావైరస్ వ్యాధి వల్ల ఇప్పటివరకు సుమారు 3,200 మందికి పైగా మరణించారు. అనేక కంపెనీలు ఆఫీస్ సమావేశాలను కూడా రద్దు చేశాయి. ఉద్యోగుల ప్రయాణాలపై కూడా ఆంక్షలు విధించాయి. దీనికి తోడు ఇంటి నుంచే ఆఫీస్ పనులను చేయాలని ఇందుకోసం ఉద్యోగులు సహకరించాలి అని కోరింది.
 

click me!