
గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. క్రూడ్ ధరలు 93 డాలర్ల పైకి చేరాయి. అయితే దేశంలో నేటి (ఫిబ్రవరి 7, 2022) పెట్రోల్ ధర నిలకడగానే కొనసాగుతోంది. డీజిల్ ధర కూడా స్థిరంగానే ఉంది. దీంతో సోమవారం కూడా దేశీ ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదని చెప్పుకోవచ్చు. పెట్రోల్, డీజిల్ ధరలు చాలా రోజుల నుంచి మార్పు లేకుండా స్థిరంగా ఉంటూ వస్తున్నాయి. దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి. బడ్జెట్‌కు తర్వాత కూడా మన వద్ద ధరలు స్థిరంగా ఉన్నాయి.
వివిధ నగరాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు
- ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 95.41, డీజిల్ లీటర్ కు రూ. 86.67
- చెన్నైలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 101.40, డీజిల్ ధర లీటర్ కు రూ. 91.43
- కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 104.67, డీజిల్ ధర లీటర్ కు రూ. 89.79
- త్రివేండ్రంలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 106.36, డీజిల్ ధర లీటర్ కు రూ. 93.47
- హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 108.20, డీజిల్ ధర లీటర్ కు రూ. 94.62
- విశాఖపట్నంలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 109.05, డీజిల్ ధర లీటర్ కు రూ. 95.18
- బెంగళూరులో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 100.58, డీజిల్ ధర లీటర్ కు రూ. 85.01
- జైపూర్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 107.06, డీజిల్ ధర లీటర్ కు రూ. 90.70
- లక్నోలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 95.15, డీజిల్ ధర లీటర్ కు రూ. 86.80
- భువనేశ్వర్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 101.81, డీజిల్ ధర లీటర్ కు రూ. 91.62
- ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి. క్రూడ్ ధరలు 93 డాలర్ల పైకి చేరాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.41 శాతం పైకి కదిలింది. దీంతో బ్రెంట్ ఆయిల్ ధర 93.18 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ధర మాత్రం తగ్గింది. 0.28 శాతం దిగివచ్చింది. దీంతో ఈ రేటు 92.06 డాలర్లకు ఎగసింది. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు పైపైకి చేరుతున్నాయి. త్వరలో ఫెడ్ రేట్లు పెరగనున్నాయనే అంశం ప్రభావం చమురుపై కనిపిస్తోంది. అయితే ఉద్రిక్తతల కారణంగా ధరలు పెరుగుతున్నాయి.