అకౌంట్ స్టేట్‌మెంట్‌ల కోసం ఖాతాదారులు ఇకపై బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అకౌంట్ స్టేట్‌మెంట్‌ను ఇంటి నుండి కూడా యాక్సెస్ చేయవచ్చు. ఫోన్ ద్వారా అకౌంట్ స్టేట్‌మెంట్ పొందడానికి SBI కాంటాక్ట్ సెంటర్‌కు కాల్ చేయవచ్చు.
డిజిటల్ యుగంలో బ్యాంకింగ్ రంగం కూడా చాలా మారిపోయింది. బ్యాంకుల్లో గంటల కొద్దీ క్యూలో వేచి ఉండే రోజుల నుండి డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి ఇప్పుడు ATM కార్డ్‌లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా, దేశంలో ఇప్పుడు అనేక బ్యాంకింగ్ సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. దింతో బ్యాంకుల్లో ఖాతాదారుల రద్దీ తగ్గి, పనులు సులువైనందున ఇలాంటి సేవలు ఎంతో ఉపకరిస్తాయి. ఇప్పుడు అలాంటి శుభవార్త ఏంటంటే.. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు మరింత చేరువైంది.
అకౌంట్ స్టేట్‌మెంట్‌ల కోసం ఖాతాదారులు ఇకపై బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అకౌంట్ స్టేట్‌మెంట్‌ను ఇంటి నుండి కూడా యాక్సెస్ చేయవచ్చు. ఫోన్ ద్వారా అకౌంట్ స్టేట్‌మెంట్ పొందడానికి SBI కాంటాక్ట్ సెంటర్‌కు కాల్ చేయవచ్చు. ఏదైనా టోల్ ఫ్రీ నంబర్‌కు 1800 1234 లేదా 1800 2100కి కాల్ చేయవచ్చు.
కాల్ చేసిన తర్వాత, అకౌంట్ బ్యాలెన్స్ లేదా లావాదేవీల వివరాలను పొందడానికి కీప్యాడ్‌పై 1 నొక్కండి. దీని తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ నంబర్‌లోని చివరి నాలుగు అంకెలను ఎంటర్ చేయండి. అకౌంట్ స్టేట్‌మెంట్‌ను పొందడానికి కీప్యాడ్‌పై 2 నొక్కాలి, ఆ తర్వాత కస్టమర్ స్టేట్‌మెంట్ వ్యవధిని ఎంచుకోవలసి ఉంటుంది. వ్యవధిని ఎంచుకున్న వెంటనే బ్యాంక్ కస్టమర్ ఇమెయిల్ ఐడీకి సమాచారాన్ని పంపుతుంది.
గత పదేళ్లలో డిజిటలైజేషన్ ప్రభావం బ్యాంకింగ్ రంగంలో కూడా ప్రతిఫలించింది. డిజిటల్ విప్లవం ఫలితంగా బ్యాంకులతో కస్టమర్లు వ్యవహరించే విధానం కూడా మారిపోయింది.ఇంతకు ముందు బ్యాంకింగ్‌కు బ్యాంకులు మాత్రమే ఆధారం. కానీ నేడు, డిజిటల్ ఆధారిత NBFCలు, నియో బ్యాంకులు మొదలైనవి కూడా ఆర్థిక సేవలను అందించడంలో యాక్టీవ్ గా ఉన్నాయి.