భారీగా తగ్గిన పసిడి ధర

First Published Aug 2, 2018, 4:43 PM IST
Highlights

భారీగా తగ్గిన బంగారం ధర, పసిడి బాటలోనే  వెండి కూడా..

పసిడి ధర ఈరోజు భారీగా పడిపోయింది. నేటి బులియన్ మార్కెట్ లో  రూ.365 తగ్గి పది గ్రాముల బంగారం ధర రూ. 30,435కి చేరుకుంది. స్థానిక జువెల్లర్స్‌ నుంచి డిమాండ్‌ క్షీణించడం, గ్లోబల్‌గా ఈ విలువైన మెటల్‌కు సంకేతాలు బలహీనంగా వస్తుండటంతో బులియన్‌ మార్కెట్‌లో ధరలు క్షీణించినట్టు బులియన్‌ ట్రేడర్లు చెప్పారు. బంగారంతో పాటు వెండి ధరలూ స్వల్పంగా తగ్గాయి. 

పారిశ్రామిక యూనిట్లు, కాయిన్‌ తయారీదారుల నుంచి వెండికి డిమాండ్‌ కాస్త తగ్గడంతో, కేజీ వెండి ధర 50 రూపాయలు తగ్గి రూ.40 వేల కింద రూ.39 వేలుగా రికార్డైంది. అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లు పెంచకుండా యథాతథంగా ఉంచడంతో డాలర్‌ బలపడింది. దీంతో ఈ విలువైన మెటల్‌కు అంతర్జాతీయంగానూ డిమాండ్‌ తగ్గింది. 

అంతర్జాతీయ మార్కెట్లో 0.65 శాతం పడిపోయి ఔన్స్‌  బంగారం 1,215.50 డాలర్లుగా నమోదైంది. బలహీనమైన గ్లోబల్‌ ట్రెండ్‌తో పాటు, దేశీయంగా ఆభరణ వర్తకుల నుంచి డిమాండ్‌ తగ్గిపోయింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు 365 రూపాయల చొప్పున పడిపోయి రూ.30,435, రూ.30,285గా నమోదయ్యాయి. కాగా, నిన్న బంగారం ధర రూ.150 పెరిగిన సంగతి తెలిసిందే.  

click me!