బంగారం షాపింగ్ చేయాలనుకుంటున్నారా.. అయితే నేడు పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

By asianet news teluguFirst Published Dec 17, 2022, 9:19 AM IST
Highlights

భారతదేశంలోని ప్రధాన నగరాలలో బంగారం ధరలలో హెచ్చుతగ్గులను నమోదు చేశాయి. ఈరోజు చెన్నైలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.47,927గా ఉంది.

గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరల్లో ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. గత 24 గంటల్లో 24 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరిగింది. డిసెంబర్ 17 నాటికి 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 54,000 కాగా, 22 క్యారెట్ (10 గ్రాములు) ధర రూ. 49,460.

భారతదేశంలోని ప్రధాన నగరాలలో బంగారం ధరలలో హెచ్చుతగ్గులను నమోదు చేశాయి. ఈరోజు చెన్నైలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.47,927గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 54,380 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ. 49,850. కోల్‌కతాలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 54,220 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ. 49,700. మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.54,220 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.49,700గా ఉంది.

హైదరాబాద్, బెంగళూరు, కేరళ ఇంకా విశాఖపట్నంలలో ఈ రోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే ఇటీవలి కాలంలో బంగారం ధరలు అస్థిరంగా ఉండడం, భారత రూపాయి బలహీనపడడమే ఇందుకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.

 హైదరాబాద్‌లో బంగారం ధరలు 10 గ్రాముల 22 క్యారెట్‌లకు రూ. 49,700 వద్ద, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం  ధర రూ. 54,220గా ఉంది.

 కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,700, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,220. విశాఖపట్నంలో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 49,700, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,220.

మరోవైపు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 72,500.
 
22 క్యారెట్ల, 24 క్యారెట్ల మధ్య తేడా ఏమిటి?
24 క్యారెట్ల బంగారం 99.9% స్వచ్ఛమైనది. 22 క్యారెట్ దాదాపు 91% స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారానికి  9% రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలను కలిపి ఆభరణాలు తయారు చేస్తారు. 24 క్యారెట్ల బంగారం స్వచ్ఛమైనది అయినప్పటికీ ఆభరణాలుగా  తయారు చేయడం సాధ్యం కాదు. కాబట్టి చాలా మంది దుకాణదారులు బంగారాన్ని 22 క్యారెట్లలో విక్రయిస్తారు.

బంగారం స్వచ్ఛత తెలుసుకోవడం ఎలా?
బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) ద్వారా హాల్ మార్కులు ఇస్తారు. 24 క్యారెట్లపై 999, 23 క్యారెట్లపై 958, 22 క్యారెట్లపై 916, 21 క్యారెట్లపై 875, 18 క్యారెట్లపై 750. చాలా వరకు బంగారాన్ని 22 క్యారెట్లలో విక్రయిస్తుండగా, కొందరు 18 క్యారెట్లను కూడా ఉపయోగిస్తున్నారు. క్యారెట్ ఎంత ఎక్కువ ఉంటే బంగారం అంత స్వచ్ఛంగా ఉంటుందని చెబుతారు.

click me!