బంగారం, వెండి ధరలు.. తగ్గేదే లే.... ఇప్పట్లో కొనడం కష్టమేనా.. ఎంత పెరిగిందంటే..?

By asianet news teluguFirst Published Dec 6, 2022, 10:24 AM IST
Highlights

నేడు మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో బంగారం, వెండి ధర మరింత పెరిగింది, 10 గ్రాముల పసిడి 24 క్యారెట్ల ధర రూ. 160 పెరిగి రూ. 54,110కి చేరింది. ఇదిలా ఉండగా వెండి ధరలు కిలోకు రూ. 1,300 పెరిగి ఈ రోజు రూ. 66,500 వద్ద ట్రేడవుతున్నాయి.

పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ కావడంతో పసిడి ధరలకు రెక్కలొచ్చాయి. గత కొద్దిరోజులుగా పసిడి ధరలు పెరుతూనే వస్తున్నాయి. 

నేడు మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో బంగారం, వెండి ధర మరింత పెరిగింది, 10 గ్రాముల పసిడి 24 క్యారెట్ల ధర రూ. 160 పెరిగి రూ. 54,110కి చేరింది. ఇదిలా ఉండగా వెండి ధరలు కిలోకు రూ. 1,300 పెరిగి ఈ రోజు రూ. 66,500 వద్ద ట్రేడవుతున్నాయి. 

ఒక నివేదిక  ప్రకారం పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.150 పెరిగి నేడు రూ.49,600 వద్ద ట్రేడవుతోంది.ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, కేరళ ఇంకా పూణేలలో 10 గ్రాముల బంగారం 24 క్యారెట్ల ధర రూ.54,110, 22 క్యారెట్లు  ధర రూ.49,600 వద్ద ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల  బంగారం ధర  రూ. 54,260, 22 క్యారెట్ల ధర రూ. 49,750 వద్ద ట్రేడవుతోంది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.55,040, , 22 క్యారెట్ల ధర రూ.50,450గా ఉంది.

0011 GMT నాటికి స్పాట్ బంగారం ఔన్సుకు $1,768.61 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది. US గోల్డ్ ఫ్యూచర్‌లు $1,780.90 డాలర్ల వద్ద కొద్దిగా మారాయి.స్పాట్ సిల్వర్ 0.1% తగ్గి $22.23డాలర్లకి, ప్లాటినం $997.84 డాలర్ల వద్ద ఫ్లాట్ గా, పల్లాడియం 0.2% పెరిగి $1,878.93డాలర్లకి చేరుకుంది.

ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.943కు చేరింది.  ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ బ్యాక్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ అయిన SPDR గోల్డ్ ట్రస్ట్ హోల్డింగ్స్ 0.2 శాతం తగ్గి 903.46 టన్నులకు పడిపోయిందని తెలిపింది.

ఢిల్లీ, ముంబైలలో కిలో వెండి ధర రూ.66,500గా ఉంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలో కిలో ధర రూ.72,500 వద్ద ట్రేడవుతోంది. స్పాట్ సిల్వర్ 0.1 శాతం తగ్గి $22.23కి చేరుకుంది.

click me!