పెట్రోల్, డీజిల్ ధరల అప్ డేట్: త్వరలో ఇంధన ధరలు తగ్గనున్నాయా.. లీటరుకి ఎంతంటే..?

By asianet news teluguFirst Published Dec 6, 2022, 9:29 AM IST
Highlights

దాదాపు ఆరు నెలలుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మారకపోవటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలో చివరిసారి మార్పు మే 21న జరిగింది. 

అంతర్జాతీయ మార్కెట్‌లో  క్రూడాయిల్ ధరలు తగ్గిన తర్వాత కూడా భారత మార్కెట్‌లో ఇంధన ధరల్లో పెద్దగా మార్పు లేదు. దీనికి విరుద్ధంగా దేశంలో కొన్ని చోట్ల పెట్రోల్ డీజిల్ ధరలలో స్వల్ప పెరుగుదల మాత్రమే కనిపిస్తోంది. మరోవైపు నాలుగు మెట్రో నగరాల్లో 6 నెలలకు పైగా ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు. 

దాదాపు ఆరు నెలలుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మారకపోవటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలో చివరిసారి మార్పు మే 21న జరిగింది. కేంద్ర ప్రభుత్వం  ఇంధన ధరలపై వ్యాట్ తగ్గించగా చాలా రాష్ట్రాల్లో  పెట్రోల్, డీజిల్ ధర దిగోచ్చింది. ఆయిల్ కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షించి కొత్త ధరలను జారీ చేస్తాయి.  


దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ లీటరు ధర రూ.106.03కు, లీటర్ డీజిల్ ధర రూ.92.76. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31కి, డీజిల్ ధర లీటర్ రూ.94.27కి చేరింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.74, డీజిల్ ధర రూ.94.33గా ఉంది.

జైపూర్‌లో లీటరు పెట్రోలు ధర రూ.108.62కు, లీటర్ డీజిల్ ధర రూ.93.84గా ఉంది.
పాట్నాలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.74కు, డీజిల్ ధర లీటరు రూ.94.51కి లభిస్తోంది.
లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.62, డీజిల్ ధర రూ.89.81గా ఉంది.
నోయిడాలో పెట్రోల్ ధర రూ. 97.00, డీజిల్ ధర లీటరుకు రూ. 90.14.
గురుగ్రామ్‌లో లీటరు పెట్రోలు ధర రూ.97.38కి, లీటర్ డీజిల్ ధర రూ.90.24కి లభిస్తోంది.
హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర  రూ.97.82.

నేడు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్  ధర
నేటికీ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్  ధరల్లో  హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. బ్రెంట్ క్రూడ్ $0.83 లేదా ఒక శాతం పెరిగి $83.51కి చేరుకోగా, WTI క్రూడ్ $0.80 లేదా 1.04 శాతం పెరిగి $77.73 వద్ద ట్రేడవుతోంది. 

click me!