బంగారం-వెండి ధరలు: కొనేందుకు మంచి ఛాన్స్.. మార్గశిర మాసం మొదటి రోజు తగ్గిన పసిడి ధర..

By asianet news teluguFirst Published Nov 24, 2022, 9:19 AM IST
Highlights

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో పసిడి, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 1755 డాలర్ల వద్ద, స్పాట్ సిల్వర్ ఔన్సుకు 21.64 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.73 వద్ద ఉంది.

ప్రపంచవ్యాప్తంగా నేడు బంగారం-వెండి ధరల్లో హెచ్చుతగ్గులు స్థిరంగా ఉన్నాయి. అయితే భారత మార్కెట్‌లో మాత్రం మరోసారి బంగారం ధర పతనం నమోదైంది. దీంతో కస్టమర్లు పసిడని  కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో పసిడి, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 1755 డాలర్ల వద్ద, స్పాట్ సిల్వర్ ఔన్సుకు 21.64 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.73 వద్ద ఉంది.

 నవంబర్ 24 (గురువారం)న 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 52,420 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 48,020. అయితే  24 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారం ధర ఈరోజు  రూ.90 నుండి రూ.110 తగ్గింది.

భారతదేశంలోని వివిధ మెట్రో నగరాల్లో పసిడి ధరలు  చూస్తే ఈరోజు చెన్నైలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.47,927గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.52,800 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.48,400. కోల్‌కతాలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 52,640 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ. 48,250. ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.52,640 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.48,250గా ఉంది.

 ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 100  తగ్గి రూ.48,250 వద్ద ఉంది. 24 క్యారెట్ల  10 గ్రాముల బంగారం ధర  రూ.110 తగ్గి రూ.52,640కి చేరింది. మరోవైపు వెండి విషయానికి వస్తే  ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.500 పెరిగి రూ. 67,500కు చేరింది. 

సాధారణంగా 24 క్యారెట్ల బంగారాన్ని స్వచ్ఛమైనదిగా పరిగణిస్తారు, అయితే ఈ బంగారం చాలా మృదువైనది కాబట్టి నగలు తయారు చేయలేరు. అందుకే నగలు లేదా ఆభరణాల తయారీలో ఎక్కువగా 22 క్యారెట్ల బంగారాన్ని మాత్రమే ఉపయోగిస్తారు.

ఏ క్యారెట్ బంగారం ఎంత స్వచ్ఛమైనది అంటే ?
24 క్యారెట్ల బంగారం 99.9 శాతం.
23 క్యారెట్ల బంగారం 95.8 శాతం.  
22 క్యారెట్ల బంగారం 91.6 శాతం.
21 క్యారెట్ల బంగారం 87.5 శాతం.
18 క్యారెట్ల బంగారం 75 శాతం.
17 క్యారెట్ల బంగారం 70.8 శాతం.  
14 క్యారెట్ల బంగారం 58.5 శాతం.
9 క్యారెట్ల బంగారం 37.5 శాతం.

పసిడి కొనే సమయంలో కస్టమర్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి
 కస్టమర్లు బంగారాన్ని కొనే సమయంలో పసిడి నాణ్యతను చూసుకోవాలి. హాల్‌మార్క్ గుర్తు చూసిన తర్వాత మాత్రమే బంగారాన్ని కొనుగోలు చేయండి. ప్రతి క్యారెట్‌కు భిన్నమైన హాల్‌మార్క్ నంబర్ ఉంటుంది. హాల్‌మార్క్ అనేది బంగారానికి ప్రభుత్వ హామీ, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) హాల్‌మార్క్‌ని నిర్ణయిస్తుంది. 

click me!