ఇంధన ధరల అప్ డేట్: పడిపోతున్న క్రూడాయిల్.. నేడు పెట్రోల్, డీజిల్ ధర ఎంత తగ్గిందంటే..?

By asianet news teluguFirst Published Nov 24, 2022, 8:37 AM IST
Highlights

ఈ రోజు ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31కి, డీజిల్ ధర రూ.94.27గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర  రూ.102.63, డీజిల్ ధర రూ.94.24.

నేడు నవంబర్ 24న ఇంధన రిటైలర్లు జారీ చేసిన తాజా ధరల నోటిఫికేషన్ ప్రకారం ఇండియాలోని మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.

ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31కి, డీజిల్ ధర రూ.94.27గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర  రూ.102.63, డీజిల్ ధర రూ.94.24, కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర రూ.92.76గా ఉన్నాయి.

క్రూడాయిల్ 
 బ్రెంట్ ఫ్యూచర్స్ $2.95  డాలర్లు లేదా 3.3 శాతం తగ్గి బ్యారెల్ $85.41 డాలర్ల వద్ద స్థిరపడింది. US క్రూడ్ బ్యారెల్‌కు $3.01 డాలర్లు లేదా 3.7 శాతం పడిపోయి $77.94డాలర్లకి చేరుకుంది.  

ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం US గ్యాసోలిన్ స్టాక్స్ 3.1 మిలియన్ బ్యారెల్స్ పెరిగాయి, విశ్లేషకులు అంచనా వేసిన 383,000 బ్యారెల్ బిల్డ్ కంటే చాలా ఎక్కువ.

ప్రభుత్వ చమురు కంపెనీలు జారీ చేసిన రేటు ప్రకారం, ఈ ఉదయం గౌతమ్ బుద్ నగర్ జిల్లాలో (నోయిడా-గ్రేటర్ నోయిడా) పెట్రోల్‌ ధర లీటరుకు 35 పైసలు తగ్గి  రూ. 96.65, డీజిల్‌ 32 పైసలు తగ్గి లీటరుకు రూ. 89.82గా ఉంది. యూపీ రాజధాని లక్నోలో లీటర్ పెట్రోల్ ధర 13 పైసలు తగ్గి రూ.96.44కి చేరుకోగా, డీజిల్ ధర 12 పైసలు తగ్గి రూ.89.64కి చేరుకుంది. మరోవైపు బీహార్ రాజధాని పాట్నాలో ఈరోజు పెట్రోల్ ధర 21 పైసలు పెరిగి రూ.107.80కి చేరుకోగా, డీజిల్ ధర 20 పైసలు పెరిగి రూ.94.56కి చేరుకుంది.

- నోయిడాలో పెట్రోల్ ధర రూ. 96.65, డీజిల్ ధర లీటరుకు రూ. 89.82.
-లక్నోలో లీటరు పెట్రోల్‌ ధర రూ.96.44, డీజిల్‌ ధర రూ.89.64గా ఉంది.
–పాట్నాలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.80, డీజిల్ ధర రూ.94.56కి చేరింది.
–ఘజియాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.58, డీజిల్‌ ధర రూ.89.75గా ఉంది.
-హైదరాబాద్ లో నేడు లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర లీటరుకు రూ.97.82.

ప్రతిరోజు  ఉదయం పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షిస్తుంటారు. ఏవైనా మార్పులు ఉంటే కొత్త ధరలు ఉదయం 6 గంటల నుంచి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్ ఇతర జోడించిన తర్వాత దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇంత ఎక్కువగా కనిపించడానికి ఇదే కారణం.

click me!