బంగారం, వెండి కొనేవారికి మంచి ఛాన్స్.. దొగోస్తున్న పసిడి ధరలు.. తులం ఎంత తగ్గిందంటే..?

Published : Nov 08, 2022, 09:45 AM IST
బంగారం, వెండి కొనేవారికి మంచి ఛాన్స్.. దొగోస్తున్న పసిడి ధరలు.. తులం ఎంత తగ్గిందంటే..?

సారాంశం

ఒక నివేదిక ప్రకారం, ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.46,900. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 51,160. పూణెలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.46,930గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,190గా ఉంది. 

మీరు బంగారం లేదా వెండి కొనుగోలు చేయాలనుకుంటే మంచి అవకాశం. గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరల్లో ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. ఈ వారం ప్రారంభం నుంచి అంటే సోమవారం బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టగా నేడు కూడా పసిడి, వెండి ధరలు మరింత దిగోచ్చాయి.

ఒక నివేదిక ప్రకారం, ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.46,900. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 51,160. పూణెలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.46,930గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,190గా ఉంది. నాగ్‌పూర్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,930, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,190. నాసిక్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,930 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.51,190గా ఉంది. 

నేడు హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలలో పసిడి ధరలు కాస్త దిగ్గోచ్చాయి. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ. 100 పతనంతో రూ. 46,900గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 120 పతనంతో రూ. 51,160గా ఉంది. హైదరాబాద్‌లో బంగారం ధరలు 10 గ్రాముల 22 క్యారెట్‌లకు రూ. 100 తగ్గి రూ. 46,900 వద్ద , 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 120 పడిపోయి రూ. 51,160గా ఉంది. 

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,900, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,160. విశాఖపట్నంలో బంగారం ధరలు  22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,900, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,160. మరోవైపు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 66,300గా ఉంది.

బంగారం స్వచ్ఛత తెలుసుకోవడం ఎలా?
బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) ద్వారా హాల్ మార్కులు ఇస్తారు. 24 క్యారెట్లపై 999, 23 క్యారెట్లపై 958, 22 క్యారెట్లపై 916, 21 క్యారెట్లపై 875, 18 క్యారెట్లపై 750 ఉంటుంది. ఎక్కువగా బంగారాన్ని 22 క్యారెట్లలో విక్రయిస్తుండగా, కొందరు 18 క్యారెట్లను కూడా ఉపయోగిస్తారు. క్యారెట్ ఎంత ఎక్కువ ఉంటే బంగారం అంత స్వచ్ఛంగా ఉంటుందని చెబుతారు.

22 క్యారెట్ల అండ్ 24 క్యారెట్ల మధ్య తేడా ఏంటి?

24 క్యారెట్ల బంగారం 99.9% స్వచ్ఛమైనది, 22 క్యారెట్ దాదాపు 91% స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారంలో 9% రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలను కలిపి ఆభరణాలు తయారు చేస్తారు. 24 క్యారెట్ల బంగారం స్వచ్ఛమైనది ఆయితే దానితో ఆభరణాలు  తయారు చేయడం సాధ్యం కాదు . కాబట్టి చాలా మంది దుకాణదారులు బంగారాన్ని 22 క్యారెట్లలో విక్రయిస్తారు.

ప్రజలు బంగారం కొనుగోలు చేసేటప్పుడు దాని నాణ్యతను పరిగణనలోకి తీసుకోవాలి. హాల్‌మార్క్  గుర్తును చూసిన తర్వాత మాత్రమే కొనుగోలు చేయాలి. ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర పన్నులు, మేకింగ్ ఛార్జీల కారణంగా భారతదేశం అంతటా బంగారు ఆభరణాల ధరలు మారుతూ ఉంటాయి.

PREV
click me!

Recommended Stories

Most Expensive Vegetables : కిలో రూ.1 లక్ష .. భారత్‌లో అత్యంత ఖరీదైన కూరగాయలు ఇవే
iPhone : ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 17 ప్రో, 15 ప్లస్‌పై భారీ తగ్గింపులు !