మండుతున్న క్రూడాయిల్ ధరలు.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్ళీ పెరగనున్నాయా.. లీటరు ధర ఎంతంటే..?

Published : Nov 08, 2022, 09:03 AM IST
మండుతున్న క్రూడాయిల్ ధరలు.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్ళీ పెరగనున్నాయా.. లీటరు ధర ఎంతంటే..?

సారాంశం

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) అధికారిక వెబ్‌సైట్ iocl.com తాజా అప్‌డేట్ ప్రకారం లీటర్ పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27గా ఉంది.  

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ఆధారంగా  దేశీయ చమురు మార్కెటింగ్‌ కంపెనీలు ప్రతిరోజు  పెట్రోల్‌, డీజిల్‌ ధరలను సమీక్షిస్తాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలో  అస్థిరత  మధ్య  భారతీయ చమురు కంపెనీలు చాలా కాలంగా పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా ఉంచాయి. నేడు 8 నవంబర్ 2022న ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైతో సహా దేశంలోని ప్రముఖ నగరాల్లో ఇంధనం ధరలో ఎలాంటి మార్పు లేదు.  

ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో ఒక లీటర్ పెట్రోల్ ధర రూ. 96.72, ఒక లీటర్ డీజిల్ ధర రూ. 89.62గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) అధికారిక వెబ్‌సైట్ iocl.com తాజా అప్‌డేట్ ప్రకారం లీటర్ పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27గా ఉంది.  కోల్‌కతాలో పెట్రోల్ ధర 106.03, డీజిల్ ధర లీటరుకు రూ.92.76గా ఉంది.

పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం తగ్గించడంతో మే నెలలో ఇంధన ధరల్లో చివరిగా దేశవ్యాప్త హెచ్చుతగ్గులు కనిపించాయి.

మంగళవారం ఉదయం WTI క్రూడ్ బ్యారెల్‌కు 92.01 డాలర్లకు, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 97.95 డాలర్లకు చేరింది. ఒపెక్ దేశాలు ఉత్పత్తిని తగ్గించడంతో ముడిచమురు ధరలు పెరుగుతున్నాయి.

ప్రముఖ నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు
- నోయిడాలో పెట్రోలు ధర రూ. 96.57, డీజిల్ ధర లీటరుకు రూ. 89.96
- పాట్నాలో పెట్రోల్ ధర  రూ. 107.24, డీజిల్ ధర రూ. 94.04
- గురుగ్రామ్ పెట్రోల్ ధర రూ. 97.18, డీజిల్ ధర రూ. 90.05
- లక్నోలో  పెట్రోల్ ధర రూ. 96.57, డీజిల్ ధర రూ. 89.76
-తిరువనంతపురంలో పెట్రోల్ ధర  రూ.107.71, డీజిల్ ధర లీటరుకు రూ.96.52
- చండీగఢ్‌లో పెట్రోల్ ధర రూ.96.20, డీజిల్ ధర రూ.84.26
-హైదరాబాద్‌లో పెట్రోలు ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82

ఆయిల్ కంపెనీలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) క్రూడాయిల్ ధరల ఆధారంగా ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ఇంధన ధరలను జారీ చేస్తాయి. పెట్రోల్ లేదా డీజిల్ ధరలో ఏదైనా మార్పు ఉంటే అమలు చేస్తాయి. VAT ధరలు ,రవాణా ఛార్జీలు కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు అన్నీ రాష్ట్రాలలో ఒకే విధంగా ఉండవు. 

PREV
click me!

Recommended Stories

Most Expensive Vegetables : కిలో రూ.1 లక్ష .. భారత్‌లో అత్యంత ఖరీదైన కూరగాయలు ఇవే
iPhone : ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 17 ప్రో, 15 ప్లస్‌పై భారీ తగ్గింపులు !