స్మార్ట్ ఫోన్ మార్కెట్లో తన ఆధిపత్యం నిలబెట్టుకునేందుకు చైనా, జిత్తులమారి నక్కలా వ్యవహరిస్తోంది. ఏ కంపెనీ కింద ఐదు రకాల ఫోన్ బ్రాండ్లను తయారుచేసి, వాటిని వేరువేరు కంపెనీల లాగా కలరింగ్ ఇచ్చి కస్టమర్లను కన్ఫ్యూజ్ చేసి చివరకు తమ కంపెనీ ఫోన్ కొనేలా చేయడంలో చైనా కంపెనీ సక్సెస్ అవుతోంది.
లడఖ్‌లో చైనా, భారత సైనికుల మధ్య ఘర్షణ జరిగిన తర్వాత చైనా బహిష్కరణ ప్రచారం ఊపందుకుంది. చైనా కంపెనీలు ఉత్పత్తి చేసే ఉత్పత్తులకు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభమైంది. గత ఏడెనిమిదేళ్లుగా చైనా మొబైల్ దేశమంతటా పాపులర్ అయింది. మీరు ఆశ్చర్యపోవచ్చు, దేశంలో అత్యధిక ఫోన్‌లను విక్రయించే ఐదు ప్రధాన చైనీస్ బ్రాండ్‌లకు ఒకే కంపెనీ మూలం. అదే కంపెనీ భారతదేశంలో వివిధ బ్రాండ్ల పేరిట వివిధ ధరలకు విక్రయిస్తోంది.
నాణ్యత, సాంకేతికత, సామర్థ్యంలో కొద్ది తేడాలతో కనిపించి ఈ మొబైల్స్ ను వివిధ బ్రాండ్ల పేరుతో ఈ సంస్థ అమ్మేస్తోంది. అంతేకాదు ఈ మొత్తం ఐదు బ్రాండ్లు ఒకే విధమైన లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ, అవి వేర్వేరు బ్రాండ్ల పేరుతో మార్కెట్లో విడుదల అవుతుంటాయి. కేవలం డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో కొన్ని బ్రాండ్‌లు ఎక్కువ ధరలను వసూలు చేస్తుంటే, మరికొన్ని బ్రాండ్‌లు తక్కువ ధరకే ఉంటాయి.
చైనీస్ కంపెనీ BBK ఎలక్ట్రానిక్స్ ఐదు ప్రధాన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లను కలిగి ఉన్న మాతృసంస్థ, 1998లో చైనాలో ప్రారంభమైన ఈ BBK ఎలక్ట్రానిక్స్ ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద మొబైల్ కంపెనీలలో ఒకటి. One Plus, Oppo, Vivo, iQOO, Realme అన్నీ ఈ ఒకే కంపెనీకి చెందిన ఫోన్‌లు. ఈ BBK ఎలక్ట్రానిక్స్ కంపెనీ స్మార్ట్‌ఫోన్‌ను మాత్రమే కాకుండా, బ్లూరే ప్లేయర్, హెడ్‌ఫోన్, స్మార్ట్‌ఫోన్, టీవీ, గాడ్జెట్‌లను కూడా ఉత్పత్తి చేస్తుంది.
Samsung ప్రపంచంలోనే నంబర్ వన్ స్మార్ట్‌ఫోన్ తయారీదారుగా నిలవగా. ఆ తర్వాతి స్థానంలో ఉన్న హువావే, యాపిల్‌లను వెనక్కి నెట్టి బీబీకే ఎలక్ట్రానిక్స్ రెండో స్థానంలో నిలిచింది. దీనికి కారణం భారత మార్కెట్. బీబీకే కంపెనీకి చైనాతో పాటు భారత్ అతిపెద్ద మార్కెట్ కావడం గమనార్హం.
BBK ఐదు ప్రధాన Android స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లను కలిగి ఉంది, అవి OnePlus, Oppo, Vivo, Realme,iQOO. ఈ ఐదు వేర్వేరు కంపెనీల నుంచి స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేసే వ్యూహాన్ని ఈ కంపెనీ అనుసరిస్తోంది. ఈ కంపెనీ ఐదు బ్రాండ్‌ల క్రింద మొబైల్ ఫోన్‌లను తయారు చేస్తుంది ఎందుకంటే ఒకే బ్రాండ్ మార్కెట్‌ను నియంత్రించదు. ఐదు బ్రాండ్లలో ఉపయోగించే హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లను ఒకే కంపెనీ రూపొందించి. ఈ కంపెనీ ఒకే కంపెనీలో అనేక మొబైల్ ఫోన్‌లను ఉత్పత్తి చేస్తుంది. వాటికి వివిధ బ్రాండ్ పేర్లను ఇస్తుంది.
ప్రపంచంలోని చాలా మొబైల్ కంపెనీలు ఒక బ్రాండ్ మొబైల్ ఫోన్‌ను మాత్రమే విక్రయిస్తున్నాయి. అది యాపిల్ కావచ్చు, శాంసంగ్ కావచ్చు, నోకియా కావచ్చు. కానీ చైనాకు చెందిన BBK ఎలక్ట్రానిక్స్ కంపెనీ మార్కెట్లో పెద్ద వాటాను పెంచుకునేందుకు వివిధ బ్రాండ్ల వ్యూహాన్ని అనుసరిస్తుంది. అదే మొబైల్ కెపాసిటీ, క్వాలిటీ ఉన్న మొబైల్‌లు కొద్దిగా బాహ్య డిజైన్ మార్పుతో వేరే బ్రాండ్ పేరుతో విడుదల చేస్తుంది. మార్కెట్‌పై గుత్తాధిపత్యం కోసం మొత్తం ఐదు బ్రాండ్‌లు కోట్లాది రూపాయలను ప్రకటనల కోసం వెచ్చిస్తున్నాయి.