ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండానే, నెలకు లక్షల్లో ఆదాయం రావాలంటే ఇదే బెస్ట్ బిజినెస్..

Published : Oct 26, 2022, 11:50 PM IST
ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండానే, నెలకు లక్షల్లో ఆదాయం రావాలంటే ఇదే బెస్ట్ బిజినెస్..

సారాంశం

వ్యాపారం చేసేందుకు డబ్బు ఉంటే సరిపోదు ఆలోచన కూడా ఉండాలి. ఒక్కోసారి పెట్టుబడి లేకుండానే అని వ్యాపారం చేసి  నెలకు లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు.  మీరు కూడా అలాంటి వ్యాపార అవకాశం కోసమే  ఎదురుచూస్తున్నారా,  అయితే రియల్ ఎస్టేట్ రంగంలో  చక్కటి అవకాశం ఉందని చెప్పాలి.  ఇందుకోసం మీరు  ఏం చేయాలో తెలుసుకుందాం. 

ఈ భూమి మీద జనాభా పెరుగుతుంది కానీ ఈ భూమి పెరగడం లేదు అనేది వాస్తవం. భూమికి ఉన్నంత విలువ మరే ఇతర ఆస్తికి ఉండదు.  ఈ సూత్రం తోనే రియల్ ఎస్టేట్ రంగంలో  చాలామంది రాణిస్తున్నారు.  అయితే రియల్ ఎస్టేట్ అంటేనే పెట్టుబడి పెట్టాలి కదా మరి పెట్టుబడి లేకుండా ఎలా సాధ్యమవుతుంది అనే సందేహం మీకు కలగొచ్చు. 

కానీ అన్ని రంగాల తరహాలోనే రియల్ ఎస్టేట్ లోనూ డిమాండ్ ఉన్నప్పటికీ అమ్మకందారులు కొనుగోలుదారులు మధ్య ప్రత్యక్ష సంబంధాలు ఉండవు.  ఈమె మీరు వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు.  రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ  వ్యాపారం చేయడం ద్వారా మీరు చక్కటి ఆదాయం పొందే వీలుంది.  ఇళ్ల స్థలాలు,  ఇల్లు,  పొలాలు,  తోటలు,  అపార్ట్మెంట్ ఫ్లాట్స్  ఇలా అన్నిరకాల ఆస్తుల క్రయవిక్రయాల కోసం మీరు చేయవచ్చు.  తద్వారా మీరు ఆదాయం పొందే వీలుంది. 

 మీకు రెండు వైపుల నుంచి కమిషన్ రావచ్చు. తద్వారా చక్కటి ఆదాయం లభిస్తుంది. ఇందు కోసం మీరు ఒక ఆఫీసు తెరవాల్సి ఉంటుంది.  అంతేకాదు ఆఫీసు ద్వారా అమ్మకందారులు కొనుగోలుదారులను  కలిసే వీలుంటుంది.  అలాగే ఆన్లైన్ ద్వారా కూడా మీరు క్రయ విక్రయాలు జరపవచ్చు.  ముఖ్యంగా  విదేశాల్లో స్థిరపడిన ఎన్నారైలు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి గా ఉంటారు.  అలాంటి వారిని మీరు కాంటాక్ట్ చేసి వారికి మంచి ఆస్తులు కొనుగోలు చేసేలా మీరు సర్వీసు అందించవచ్చు.  తద్వారా మీరు కమీషన్ రూపంలో ఆదాయం పొందే వీలుంది. 

అంతేకాదు రియల్ ఎస్టేట్ రంగంలో రీసేల్ ఇళ్లకు  మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా అమ్మకందారులు,  తమకు కావాల్సిన రేటు కోసం  ఎదురుచూస్తూ ఉంటారు. అలాగే కొనుగోలుదారులు కూడా వాస్తుతో పాటు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని ఆస్తులను కొనుగోలు చేసేందుకు చూస్తుంటారు.  అలాంటి వారికి మీరు అందించే సర్వీస్ సరిపోతుంది. 

ఇక మీరు వ్యాపారంలో రాణించాలి అనుకుంటే నిజాయితీగా ఉండటం చాలా అవసరం. అలాగే న్యాయ సలహాలు కూడా ఎప్పటికప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది. అనైతిక పద్ధతులు లాభం కోసం వివాదాస్పద ఆస్తి గొడవల్లో తలదూర్చితే  మాత్రం చిక్కుల్లో పడాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్ బ్రోకర్ లేదా ఏజెంట్ లేదా కన్సల్టెంట్ గా  మీరు కెరీర్ కొనసాగించాలి అనుకుంటే RERA Registration చేయించుకోవాల్సి ఉంటుంది,

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bank Locker : బ్యాంక్ లాకర్‌లో బంగారం పెట్టారా? ఈ ఒక్క పని చేయకపోతే భారీ నష్టం
Most Expensive Metals: బంగారం కాదు.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన మెటల్స్ ఇవే