స్వల్పంగా తగ్గిన బంగారం ధర

Published : Sep 22, 2018, 04:17 PM IST
స్వల్పంగా తగ్గిన బంగారం ధర

సారాంశం

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం కారణంగా బంగారం డిమాండ్ కాస్త తగ్గింది. డిమాండ్ తగ్గడంతో ధర కూడా కాస్త తగ్గుముఖం పట్టింది

మొన్నటిదాకా పెరుగతూ వచ్చిన బంగారానికి కాస్త బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం కారణంగా బంగారం డిమాండ్ కాస్త తగ్గింది. డిమాండ్ తగ్గడంతో ధర కూడా కాస్త తగ్గుముఖం పట్టింది. శనివారం నాటి బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.250 తగ్గి రూ.31,450 పలికింది. మరోవైపు వెండి మాత్రం నేడు స్వల్పంగా పెరిగింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు జరగడంతో నేటి మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 70 పెరిగి రూ. 38,150కి చేరింది.

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో డాలర్‌ మరింత బలపడింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడికి డిమాండ్ తగ్గింది. ఇటు స్థానిక నగల వ్యాపారుల నుంచి కూడా కొనుగోళ్లు అంతంత మాత్రంగానే ఉండటంతో దేశీయంగా బంగారం ధర పడిపోయిందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగానూ ఈ లోహాల ధరలు స్వల్పంగా తగ్గాయి. న్యూయార్క్‌లో శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో ఔన్సు బంగారం ధర 0.68శాతం తగ్గి 1,198.70డాలర్లు పలికింది. వెండి కూడా 0.38శాతం తగ్గి ఔన్సు ధర 14.25డాలర్లుగా ఉంది.

PREV
click me!

Recommended Stories

Best Drone Cameras : ఏమిటీ..! కేవలం రూ.5,000 కే 4K డ్రోన్ కెమెరాలా..!!
Silver Price: 2015లో రూ. 2 ల‌క్ష‌ల వెండి కొన్న వారి ద‌గ్గ‌ర‌.. ఈరోజు ఎంత డ‌బ్బు ఉంటుందో తెలుసా?