పండగకి పసిడి ప్రియులకి గుడ్ న్యూస్.. నేడు తగ్గిన బంగారం, వెండి.. తులం ధర ఎంతంటే..?

By asianet news teluguFirst Published Jan 11, 2023, 10:41 AM IST
Highlights

ఒక నివేదిక ప్రకారం, 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి నుండి రూ. 150 తగ్గి రూ.51,450కి చేరుకుంది. ముంబై, కోల్‌కతా, హైదరాబాద్‌లలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,130, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర   రూ.51,450గా ఉంది.
 

నేడు బుధవారం బంగారం ధర రూ.160 తగ్గగా, 10 గ్రాముల పసిడి 24 క్యారెట్ల ధర రూ.56,130 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిన్నటి ముగింపు నుంచి వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. కిలో వెండి ధర రూ.71,800గా ఉంది.

ఒక నివేదిక ప్రకారం, 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి నుండి రూ. 150 తగ్గి రూ.51,450కి చేరుకుంది. ముంబై, కోల్‌కతా, హైదరాబాద్‌లలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,130, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర   రూ.51,450గా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల  బంగారం ధర రూ.56,290, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600 వద్ద ట్రేడవుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,130,  22 క్యారెట్ల పసిడి ధర రూ.52,370గా ఉంది.

0023 GMT నాటికి స్పాట్ బంగారం ఔన్సుకు $1,876.49 వద్ద కొద్దిగా మారింది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం పెరిగి $1,881.30కి చేరుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్-బ్యాక్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్ SPDR గోల్డ్ ట్రస్ట్ మంగళవారం దాని హోల్డింగ్స్ 0.13 శాతం తగ్గి 914.17 టన్నులకు పడిపోయింది.

ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో 1 కేజీ వెండి ధర రూ.71,800 వద్ద ట్రేడవుతుండగా, చెన్నైలో కేజీ వెండి ధర రూ.73,700గా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర ప్రస్తుతం రూ.73,700కు చేరింది. 

స్పాట్ వెండి $23.62డాలర్ల వద్ద స్థిరంగా ఉంది, ప్లాటినం 0.5 శాతం తగ్గి $1,076.00 డాలర్ల వద్ద, పల్లాడియం 0.4 శాతం పడిపోయి పడిపోయి $1,773 డాలర్లకు చేరుకుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ  ప్రస్తుతం రూ.81.67 వద్ద ఉంది. 

ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర పన్నులు, మేకింగ్ ఛార్జీలు వంటి అంశాల కారణంగా పసిడి ధర ప్రతిరోజూ భిన్నంగా ఉంటుంది. రివైస్డ్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(MCX) డేటా ప్రకారం, 3 ఫిబ్రవరి 2023న మెచ్యూర్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.15 శాతం పెరిగి రూ. 55,793.00కి చేరుకుంది. ఈ ఏడాది మార్చి 3న మెచ్యూర్ కానున్న సిల్వర్ ఫ్యూచర్స్ 0.28 శాతం పెరిగి రూ.68,554.00కి చేరుకుంది

click me!