ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణీకులు అపరిమిత మద్యం పొందవచ్చా.. పాలసీ ఏం చెబుతుందో తెలుసుకోండి..

By asianet news teluguFirst Published Jan 10, 2023, 11:19 AM IST
Highlights

ఎయిర్ ఇండియా విధానం ప్రకారం, మద్యం మత్తులో ఉన్న ప్రయాణికులు తమకు ఇంకా విమానంలో ఉన్న ఇతర ప్రయాణికులకు ఇబ్బందికరం. మద్యపానం చేసే వాల్ల  ద్వారా ఏదైనా చర్యను ఎదుర్కోవడానికి ఎయిర్‌లైన్‌లో చర్యలు కూడా ఉన్నాయి.

ఎయిర్ ఇండియా 'పీ స్కాండల్' జరిగినప్పటి నుండి, టాటా గ్రూప్‌కి చెందిన ఈ ఎయిర్‌లైన్ విధానాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా విమానంలో ప్రయాణీకులకు ఆల్కహాల్ అందించే విషయంలో ఎయిర్‌లైన్ విధానం ప్రశ్నార్థకమైంది. ఎయిర్‌లైన్స్ లిక్కర్ పాలసీని సమీక్షిస్తానని ఎయిర్ ఇండియా సీఈవో స్వయంగా చెప్పారు. ఈ వ్యవహారాన్ని సిబ్బంది మరింత మెరుగ్గా నిర్వహించాల్సి ఉందని ఆయన అన్నారు.

ఎయిర్ ఇండియా విధానం ప్రకారం, మద్యం మత్తులో ఉన్న ప్రయాణికులు తమకు ఇంకా విమానంలో ఉన్న ఇతర ప్రయాణికులకు ఇబ్బందికరం. మద్యపానం చేసే వాల్ల  ద్వారా ఏదైనా చర్యను ఎదుర్కోవడానికి ఎయిర్‌లైన్‌లో చర్యలు కూడా ఉన్నాయి.
ఇలాంటి పరిస్థితిలో, ఎయిర్ ఇండియా విమానాలలో అందించే మద్యం గురించి ప్రస్తుత విధానం ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం? విమానంలో ప్రయాణీకులకు ఎంత మద్యం అందించవచ్చు..? అలాగే మద్యం మత్తులో ఉన్న ప్రయాణికుల గురించి నిబంధనలు ఏం చెబుతున్నాయి..? 

1. విమానంలో ప్రయాణీకులకు వారి సీటు వద్ద మాత్రమే మద్యం ఇవ్వవచ్చు. ప్రయాణికులు సొంత మద్యం సేవించరాదు. 

2. ఒక ప్రయాణికుడికి ఒకేసారి ఒక డ్రింక్ మాత్రమే అందించబడుతుంది. ఒక డ్రింక్ లో ఒక కప్పు (12 oz) బీర్, ఒక గ్లాసు వైన్ లేదా షాంపైన్ లేదా ఒక చిన్న విస్కీ-రమ్ ఉంటాయి. 

3. విమానంలో 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి ఆల్కహాల్ అందించబడదు. 

4. నాలుగు గంటల కంటే తక్కువ వ్యవధి ప్రాయనించే విమానాల్లో ప్రయాణీకులకు అనుమతించిన దానికంటే ఎక్కువ మోతాదు ఇవ్వకూడదు.

5. ఆల్కహాల్ అందించడానికి నిబంధనలను పాటించిన తర్వాత కూడా ప్రయాణీకుడు డ్రింక్ కోసం అడిగితే, ఎయిర్‌లైన్ కనీసం మూడు గంటల బ్రేక్ నియమాన్ని అనుసరిస్తుంది. అయితే, బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు ఈ 'బ్రేక్' నిబంధన తప్పనిసరి కాదు.

6. మత్తులో ఉన్న ప్రయాణికులకు ఇకపై మద్యం సేవించవద్దని క్యాబిన్ సిబ్బంది సూచించినప్పటికి ప్రయాణికులు మద్యం మత్తులో ఉన్నారా అనే విషయాన్ని సిబ్బంది నిర్ణయిస్తారు. 

ఎయిర్ ఇండియా మద్యం పాలసీ
ఎయిర్ ఇండియా సీఈఓ-ఎండీ క్యాంప్‌బెల్ విల్సన్ 2022 నవంబర్ 26న న్యూయార్క్ - ఢిల్లీ మధ్య నడిచే AI 102లో జరిగిన సంఘటన తర్వాత, ఎయిర్‌లైన్ విమానంలో ఆల్కహాల్ సర్వీస్ విధానాన్ని సమీక్షిస్తుందని చెప్పారు. విమానాల్లో వికృత చేష్టలు చేసే ప్రయాణీకులను హ్యాండిల్ చేయడానికి సంబంధించిన నిబంధనలను ఎయిర్ ఇండియా పాటించలేదని గతంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) పేర్కొంది.

click me!