భారీగా పెరిగిన బంగారం, తగ్గిన వెండి.. హైదరాబాద్‌లో నేడు 24క్యారెట్ల, 22 క్యారెట్ల ధరలు ఇవే..

By asianet news teluguFirst Published Jan 21, 2023, 11:08 AM IST
Highlights

నేడు  శనివారం భారత్‌లో 24 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారం ధరల్లో దాదాపు రూ.380 వరకు పెరుగుదల కనిపించింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.52,350, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,110 వద్ద ట్రేడ్ అవుతుంది.

గత కొద్దిరోజులుగా దిగోస్తున్న పసిడి ధరలు నేడు మళ్ళీ పెరిగాయి. దీంతో బంగారం కొనుగోలుదారులకు మళ్ళీ  ఊహించని షాక్ తగిలింది. శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్ లో మహిళలు బంగారం కొనేందుకు ఎక్కువగా ఇష్టపడతారు.

నేడు  శనివారం భారత్‌లో 24 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారం ధరల్లో దాదాపు రూ.380 వరకు పెరుగుదల కనిపించింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.52,350, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,110 వద్ద ట్రేడ్ అవుతుంది.

స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $1926 డాలర్ల వద్ద,  స్పాట్ సిల్వర్ $23.97 డాలర్ల వద్ద ఉంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం  ప్రస్తుతం రూ.81.045 వద్ద ఉంది.

దీంతో భారతదేశంలోని ప్రముఖ నగరాలలో బంగారం ధరలు స్వల్ప మార్పులను నమోదు చేశాయి.  దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,270 కాగా, 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర  రూ. 52,500. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 72,100 వద్ద ట్రేడవుతోంది.

కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,110 కాగా, 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ. 52,350. మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,110 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర  10 గ్రాములకు రూ.52,350గా ఉంది.

హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,350, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,110గా ఉంది. వెండి ధర విషయానికి వస్తే  ఈ రోజు భారీగా తగ్గింది. కిలో వెండి ధర రూ.1400 పతనంతో  రూ.72,100కు చేరింది. 

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,400గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,160గా కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,250వద్ద, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.58,090గా ట్రేడ్ అవుతుంది. కోయంబత్తూరు, మధురైలో కూడా  ధరలు ఒకేలా కొనసాగుతున్నయి.

click me!