బంగారం ధరల అప్ డేట్.. నేడు 10 గ్రాముల ధర పెరిగిందా తగ్గిందా తెలుసుకోండి..

By asianet news teluguFirst Published Sep 21, 2022, 10:04 AM IST
Highlights

 బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ద్వారా హాల్‌మార్క్‌లు ఇస్తారు. 24 క్యారెట్ల బంగారంపై 999, 23 క్యారెట్‌పై 958, 22 క్యారెట్‌పై 916, 21 క్యారెట్‌పై 875, 18 క్యారెట్‌పై 750. 

బంగారం ధరలు ఈరోజు సెప్టెంబర్ 21న హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలలో కాస్త పెరిగాయి. బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 100 పెరుగుదలతో రూ. 45,950, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 పెరుగుదలతో రూ. 50,130 వద్ద ఉంది. హైదరాబాద్‌లో బంగారం ధరలు రూ.100  పెంపుతో 10 గ్రాముల 22 క్యారెట్‌లకు రూ. 45,950గా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పెరుగుదలతో రూ. 50,130గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,950, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,130. విశాఖపట్నంలో బంగారం ధరలు రూ. 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 45,950, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,130. మరోవైపు బెంగళూరు,  హైదరాబాద్, కేరళ, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 61,800.

బంగారం స్వచ్ఛతను ఎలా గుర్తించాలి
 బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ద్వారా హాల్‌మార్క్‌లు ఇస్తారు. 24 క్యారెట్ల బంగారంపై 999, 23 క్యారెట్‌పై 958, 22 క్యారెట్‌పై 916, 21 క్యారెట్‌పై 875, 18 క్యారెట్‌పై 750. చాలా వరకు బంగారం 22 క్యారెట్లలో అమ్ముడవుతుండగా, కొందరు 18 క్యారెట్లను కూడా ఉపయోగిస్తున్నారు.  

22 అండ్ 24 క్యారెట్ల బంగారం మధ్య తేడా తెలుసుకోండి,
24 క్యారెట్ల బంగారం 99.9 శాతం స్వచ్ఛమైనది, 22 క్యారెట్ 91 శాతం స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారంలో 9% రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలను కలపడం ద్వారా ఆభరణాలను తయారు చేస్తారు.  అందుకే చాలా మంది దుకాణదారులు 22 క్యారెట్ల బంగారాన్ని విక్రయిస్తున్నారు.

click me!