ఈ కంపెనీ షేర్లలో రూ.35 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు, నేడు రూ. 1 కోటి మీ సొంతం అయ్యేవి...

By Krishna AdithyaFirst Published Sep 21, 2022, 12:11 AM IST
Highlights

టైల్స్‌ను తయారు చేసే కజారియా సిరామిక్స్ లిమిటెడ్ అటువంటి కంపెనీలలో ఒకటి. 23 ఏళ్ల క్రితం ఈ కంపెనీలో ఇన్వెస్ట్‌ చేసి, నేటి వరకు కొనసాగిస్తున్న ఇన్వెస్టర్లు, ఆ తర్వాత తమ ఇన్వెస్ట్ చేసిన డబ్బు విలువ నేడు దాదాపు 350 రెట్లు పెరిగింది.

నిన్న ఎన్‌ఎస్‌ఈలో కజారియా సిరామిక్స్ లిమిటెడ్ షేరు రూ.1,191 వద్ద ముగిసింది. అయితే, 23 సంవత్సరాల క్రితం, జనవరి 1, 1999న, కజారియా సిరామిక్స్ షేర్లు మొదటిసారిగా NSEలో ట్రేడింగ్ ప్రారంభించినప్పుడు, ధర కేవలం రూ.3.40 మాత్రమే. ఈ విధంగా, గత 23 సంవత్సరాలలో, ఈ కంపెనీ తన పెట్టుబడిదారులకు సుమారు 34,930 శాతం బలమైన రాబడిని అందించింది.

రూ. 1 లక్ష షేర్ల విలువ రూ.4.5 కోట్లకు పెరిగింది
అంటే జనవరి 1, 1999న కజారియా సిరామిక్స్ షేర్లలో ఒక ఇన్వెస్టర్ రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి, ఇప్పటి వరకు అలాగే ఉంచి ఉంటే, ఆ రూ. 1 లక్ష విలువ నేడు దాదాపు రూ.4.5 కోట్లకు పెరిగింది. అదే సమయంలో ఒక పెట్టుబడిదారుడు అప్పట్లో కేవలం 30 వేల రూపాయల పెట్టుబడి పెట్టినా, అతని పెట్టుబడి విలువ నేడు 1 కోటి 5 లక్షల రూపాయలకు పెరిగి కోటీశ్వరుడయ్యేవాడు.

గత 5 సంవత్సరాలలో పెట్టుబడిదారులకు అందించిన 64.66 శాతం మల్టీబ్యాగర్ రాబడి
మరోవైపు, కజారియా సిరామిక్స్  ఇటీవలి పనితీరు చూస్తే, దాని షేర్లు గత ఒక నెలలో 1.08 శాతం లాభపడగా, గత ఒక సంవత్సరంలో దాని షేర్ల ధర 4.43 శాతం పెరిగింది. అదే సమయంలో, గత 5 సంవత్సరాలలో, ఇది దాని పెట్టుబడిదారులకు 64.66 శాతం మల్టీబ్యాగర్ రాబడిని ఇచ్చింది.

జెఫరీస్‌ రూ.2,000 టార్గెట్‌ విధించింది...
హౌసింగ్ రివైవల్ / హోమ్ ఫర్నిషింగ్‌లో KJC బలమైన ప్లేయర్ గా  బ్రోకరేజ్ కంపెనీ జెఫరీస్ భావిస్తోంది. కంపెనీ గురించి బుల్లిష్‌గా ఉన్నామని బ్రోకరేజ్ తెలిపింది. బ్రోకరేజ్ కంపెనీకి రూ.2,000 టార్గెట్ ధరను నిర్ణయించింది. 

కంపెనీ గురించి
కజారియా సిరామిక్స్ భారతదేశంలో సిరామిక్, విట్రిఫైడ్ టైల్స్ అతిపెద్ద తయారీదారులు. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ. 19.05 వేల కోట్లు, ప్రస్తుతం దీని షేర్లు 44.50 P/E నిష్పత్తిలో ట్రేడవుతున్నాయి.

click me!