నేడు కొత్త ఇంధన ధరలు.. పెట్రోల్ పై లీటరుకు రూ.1.45 పెంపు.. డీజిల్ ధరలు ఇవే..

By asianet news teluguFirst Published Sep 21, 2022, 9:31 AM IST
Highlights

ఈరోజు ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.106.3, డీజిల్ ధర లీటరుకు రూ.92.76గా ఉంది. ముంబైలో పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర లీటరుకు రూ.89.62గా ఉంది. 

చమురు కంపెనీలు పెట్రోల్- డీజిల్ కొత్త ధరలను విడుదల చేశాయి. నేటికీ చాలా నగరాల్లో ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం కొన్ని నెలల క్రితం ప్రకటించిన సంగతి మీకు తెలిసిందే. మరోవైపు చమురు ధరలు దాదాపు 3 నెలలకు పైగా స్థిరంగా ఉన్నాయి.

ఈరోజు ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.106.3, డీజిల్ ధర లీటరుకు రూ.92.76గా ఉంది. ముంబైలో పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర లీటరుకు రూ.89.62గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.03 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ.92.76. చెన్నైలో కూడా లీటర్ పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27గా ఉంది. నేడు బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $ 90.19, WTI క్రూడ్ ధర బ్యారెల్‌కు $ 84.45 వద్ద ఉంది. హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.109.66, డీజిల్‌ ధర రూ.97.82

మీరు ఎస్‌ఎం‌ఎస్ ద్వారా కూడా పెట్రోల్-డీజిల్ ధరలను తెలుసుకోవచ్చు. మీరు RSP అండ్ మీ సిటీ కోడ్‌ను టైప్ చేసి 9224992249 నంబర్‌కు ఎస్‌ఎం‌ఎస్ పంపాలి. ప్రతి నగరానికి కోడ్ భిన్నంగా ఉంటుంది.

పెట్రోల్ -డీజిల్ ధరలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు మారుతుంటాయి. కొత్త రేట్లు కూడా ఉదయం 6 గంటల నుంచి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్ ఇతర జోడించిన తర్వాత దాని ధర దాదాపు రెట్టింపు అవుతుంది. ఈ పారామితుల ఆధారంగా చమురు కంపెనీలు ప్రతిరోజూ పెట్రోల్ డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి. 

ద్రవ్యోల్బణంతో అల్లాడుతున్న పాకిస్తానీ ప్రజలకు మరో షాక్‌ అక్కడి ప్రభుత్వం అందించింది. బుధవారం పెట్రోల్ ధరను లీటరుకు రూ.1.45 చొప్పున పెంచింది. దీంతో కొత్తగా సవరించిన పెట్రోల్ ధరలు లీటరుకు రూ.235.98 నుండి  రూ.237.43కి పెరిగింది.

పాకిస్థాన్‌లో పెట్రోలియం ఉత్పత్తుల తాజా ధరలు:

పెట్రోల్: రూ.237.43/లీటర్

డీజిల్: రూ.247.43/లీటర్

కిరోసిన్: రూ.202.02/లీటర్

అంతర్జాతీయంగా మారుతున్న చమురు ధరలు, మారకపు ధరల వ్యత్యాసం కారణంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరగడం జరిగిందని పాకిస్థాన్ ప్రభుత్వం పేర్కొంది.
 

click me!