todays gold price: స్థిరంగా బంగారం, వెండి.. నేడు 10గ్రాముల ధర ఎంతంటే..

Published : Jul 08, 2022, 11:52 AM IST
todays gold price: స్థిరంగా బంగారం, వెండి.. నేడు 10గ్రాముల ధర  ఎంతంటే..

సారాంశం

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) విడుదల చేసిన అప్‌డేట్ డేటా ప్రకారం ఈ ఏడాది ఆగస్టు 5న మెచ్యూర్ కానున్న గోల్డ్ ఫ్యూచర్స్ 0.30 శాతం పెరిగి రూ. 50,690.00కి చేరుకుంది. 

 భారతదేశంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి అమ్మకపు ధరలో ఎటువంటి మార్పు లేదు. దీంతో ఈరోజు అంటే జూలై 8న శుక్రవారం రూ.51,110గా ఉంది. వెండి ధరలో కూడా ఎలాంటి మార్పు లేదు, ప్రస్తుతం కిలో  వెండి రూ.57,000 వద్ద లభిస్తుంది.

ఎక్సైజ్ సుంకం, మేకింగ్ ఛార్జీలు, రాష్ట్ర పన్నులతో సహా ఇతర అంశాల కారణంగా ఈ బంగారం, వెండి ధరలు మారుతూ ఉంటాయి. జూలై 8న శుక్రవారం నాడు దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు క్రింద విధంగా ఉన్నాయి:

 ఒక పోర్టల్ ప్రకారం, న్యూఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల  పసిడి ధర రూ.46,850 వద్ద ట్రేడవుతోంది. చెన్నైలో  10 గ్రాముల 22 క్యారెట్ల  బంగారం రూ.46,720కి విక్రయిస్తున్నారు.

24 క్యారెట్ల  బంగారం ధర పరిశీలిస్తే 10 గ్రాములకు న్యూఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో రూ.51,110కి విక్రయిస్తున్నారు. కాగా, చెన్నైలో  బంగారం ధర రూ.50,970గా ఉంది.

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) విడుదల చేసిన అప్‌డేట్ డేటా ప్రకారం ఈ ఏడాది ఆగస్టు 5న మెచ్యూర్ కానున్న గోల్డ్ ఫ్యూచర్స్ 0.30 శాతం పెరిగి రూ. 50,690.00కి చేరుకుంది. సెప్టెంబరు 5న మెచ్యూర్‌గా నిర్ణయించిన సిల్వర్ ఫ్యూచర్స్ 0.33 శాతం పెరిగి రూ. 56,916.00 వద్ద స్థిరపడింది.

ఇక్కడ సూచించిన బంగారం, వెండి ధరలు ఉదయం 8 గంటలకు చెందినవి అలాగే రోజంతా మారుతూ ఉంటాయి. గోల్డ్ మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్ కరెన్సీ ధరలలో మార్పులు, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు ఇతర కారణాలతో సహా బంగారం ధర మారడానికి  కారణాలుగా  ఉన్నాయి. వడ్డీ రేట్లు పెరగవచ్చని ఫెడరల్ రిజర్వ్ సంకేతాలు ఇవ్వడంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 

PREV
click me!

Recommended Stories

Bank Account: మీకు శాల‌రీ అకౌంట్ ఉందా.? అయితే మీకు మాత్ర‌మే ఉండే బెనిఫిట్స్ ఏంటో తెలుసా?
New Labour Codes : కొత్త లేబర్ కోడ్స్ తో మీ జీతం తగ్గుతుందా? కేంద్రం చెప్పిందేంటో తెలుసా!