Reliance Industries: అతి తక్కువ సమయంలోనే రిలయన్స్ లో ఒక్కో షేరుపై రూ.779 లాభం వచ్చే చాన్స్..ఎలాగో తెలుసుకోండి

Published : Jul 07, 2022, 05:33 PM ISTUpdated : Jul 07, 2022, 05:39 PM IST
Reliance Industries: అతి తక్కువ సమయంలోనే రిలయన్స్ లో ఒక్కో షేరుపై రూ.779 లాభం వచ్చే చాన్స్..ఎలాగో తెలుసుకోండి

సారాంశం

ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ అమెరికన్ ఫ్యాషన్ బ్రాండ్ గ్యాప్‌ (GAP) ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకుంది ఈ  ఒప్పందం  ద్వాారా ఇకపై GAP ఫ్యాషన్ సంస్థ నుంచి వచ్చే దుస్తులన్నీ, రిలయన్స్ రిటైల్ ద్వారా మార్కెట్లో లభించనున్నాయి.

రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ పట్ల ప్రముఖ బ్రోకరేజ్ JP మోర్గాన్ బుల్లిష్ గా ఉంది. ఎందుకంటే రిలయన్స్ రిటైల్  మాతృ సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ధర రూ. 3,170 వరకు పెరగవచ్చని అంచనా వేసింది. అదే సమయంలో, JP మోర్గాన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ BUY రేటింగ్‌ను కొనసాగిస్తోంది.

ప్రస్తుతం రిలయన్స్ షేర్లు బిఎస్‌ఇలో 1 శాతం క్షీణించి రూ.2,385 స్థాయి వద్ద ఉన్నాయి. అయితే బ్రోకరేజ్ ఇచ్చిన టార్గెట్ ధరతో పోల్చినట్లయితే, ఒక్కో షేరుకు రూ.785 వెనుకబడి ఉంది. అదే సమయంలో కంపెనీ మార్కెట్ క్యాపిటల్ రూ.16 లక్షల 17 వేల కోట్ల స్థాయిలో ఉంది.

అమెరికన్ ఫ్యాషన్ బ్రాండ్ గ్యాప్ (GAP) ఉత్పత్తులను భారతదేశానికి తీసుకురావడానికి రిలయన్స్ రిటైల్ ఒప్పందం కుదుర్చుకోవడం ఒక రకంగా ఫ్యాషన్ రంగంలో గేమ్ చేంజర్ అనే చెప్పాలి. దీని కింద, కంపెనీ ఇప్పుడు అమెరికన్ ఫ్యాషన్ బ్రాండ్ గ్యాప్ ఉత్పత్తులను భారతదేశంలో విక్రయించనుంది. ఇంతకుముందు, గ్యాప్ సంస్థ యొక్క అర్వింద్ ఫ్యాషన్స్ లిమిటెడ్. తో ఫ్రాంచైజీ ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఒప్పందం సెప్టెంబర్ 2020లో ముగిసింది.

రిలయన్స్ రిటైల్ తన అవుట్‌లెట్‌లు, మల్టీ-బ్రాండ్ స్టోర్‌లు, డిజిటల్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా భారతీయ వినియోగదారులకు గ్యాప్ బ్రాండ్ ఫ్యాషన్ ప్రొడక్ట్స్ అందిస్తుంది.

గ్యాప్ (GAP) పురుషులు, మహిళలు, పిల్లలకు దుస్తులు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల వంటివి ఉత్పత్తి చేస్తుంది. ఈ అమెరికన్ దుస్తుల కంపెనీ 1969లో శాన్ ఫ్రాన్సిస్కోలో స్థాపించబడింది.  డెనిమ్ ఆధారిత ఫ్యాషన్‌కు GAP  ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.

ఇదిలా ఉంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ను గమనిస్తే సరిగ్గా 5 ఏళ్ల క్రితం ఈ స్టాక్ ధర రూ. 750 రేంజులో ట్రేడయ్యింది. అక్కడి నుంచి ఈ స్టాక్ ధర వరుసగా పెరుగుతూ వస్తోంది. ఈ స్టాక్ ఆల్ టైం గరిష్ట స్థాయిని గమనిస్తే, ఈ ఏడాది ఏప్రిల్ 28న రూ.2,856 వద్ద నమోదు చేసింది. అయితే ప్రస్తుతం ఆల్ టైం గరిష్ట స్థాయి నుంచి కరెక్షన్ మోడ్ లో షేరు పయనిస్తోంది. కానీ గురవారం మార్కెట్ ముగిసే సమయానికి రూ. 2,391 వద్ద ఉంది. ఈ లెక్కన బ్రోకరేజీ సిఫార్సు ప్రకారం చూసినట్లయితే షేరులో రూ. 779 మేర లాభం వచ్చే అవకాశం కల్పిస్తోంది. 

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం పెట్టుబడి సలహా కాదు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం అనేది రిస్కుకు లోబడి ఉంటుంది. దయచేసి పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి.)

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Gold Jewellery: బంగారు ఆభరణాలు అద్దెకు ఇస్తే నెలలో లక్షల రూపాయలు సంపాదించే ఛాన్స్
Govt Employees Arrears: త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు లక్షల్లో చేతికి అందనున్న ఎరియర్స్