petrol diesel prices:మీ వాహనంలో పెట్రోల్ పోయిస్తున్నారా.. లీటరు పెట్రోల్ ధర తగ్గిందా పెరిగిందా తెలుసుకోండి..

Published : Jul 08, 2022, 10:57 AM ISTUpdated : Jul 08, 2022, 11:01 AM IST
petrol diesel prices:మీ వాహనంలో  పెట్రోల్ పోయిస్తున్నారా..  లీటరు పెట్రోల్ ధర తగ్గిందా పెరిగిందా తెలుసుకోండి..

సారాంశం

ముడి చమురు ధర మరోసారి 104 డాలర్ల స్థాయిని దాటింది. కాగా, ప్రభుత్వ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను యథావిధిగా కొనసాగించాయి. దీంతో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరల్లో చమురు కంపెనీలు ఎలాంటి మార్పు చేయలేదు.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు నేడు మళ్లీ పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ మరోసారి 104 డాలర్ల స్థాయిని దాటింది. దేశీయ మార్కెట్‌లో ప్రభుత్వ చమురు కంపెనీలు ఉదయం పెట్రోల్, డీజిల్ కొత్త ధరలను విడుదల చేశాయి. అయితే పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలోని ఇండియన్ ఆయిల్ పంపులో పెట్రోల్ ధర లీటరుకు రూ.96.72, డీజిల్ ధర లీటరుకు రూ.89.62గా ఉంది. దాదాపు ఒకటిన్నర నెలలుగా ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి.  

గత నెల మే 21న మోదీ ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన సంగతి మీకు తెల్సిందే. ఆ తర్వాత పెట్రోలు ధర లీటరుకు రూ.9.50, డీజిల్ ధర రూ.7 తగ్గింది. మహారాష్ట్ర, రాజస్థాన్, కేరళ ప్రభుత్వాలు కూడా ఇంధనంపై వ్యాట్‌ను తగ్గించాయి, దీంతో ఈ రాష్ట్రాల్లో ధరలు మరింత తగ్గించింది. అయితే అప్పటి నుంచి వరుసగా నెల రోజులుగా చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.35కి, డీజిల్ ధర రూ.97.28కి చేరింది.

కోల్‌కతాలో లీటరు పెట్రోలు ధర రూ.106.03కి, డీజిల్ ధర లీటరుకు రూ.92.76కి తగ్గింది.

చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉంది.

బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.101.94, డీజిల్ ధర రూ.87.89గా ఉంది.

హైదరాబాద్‌లో  పెట్రోల్‌ లీటరుకు రూ.109.66, డీజిల్ రూ.97.82.

పెట్రోల్-డీజిల్ ధరలు ప్రతిరోజూ  ఉదయం 6 గంటలకు అప్‌డేట్ చేయబడతాయి. మీరు పెట్రోల్, డీజిల్ ధరలను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్లు సిటీ కోడ్‌తో పాటు RSPని 9224992249కి ఎస్‌ఎం‌ఎస్ పంపడం ద్వారా, BPCL కస్టమర్‌లు RSPని 9223112222 నంబర్‌కు ఎస్‌ఎం‌ఎస్ పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. 

PREV
click me!

Recommended Stories

OYO Meaning: ఓయో అంటే అసలు అర్థం ఏమిటి? ఇది ఎందుకు సక్సెస్ అయిందో తెలిస్తే మైండ్ బ్లో అవుతుంది
Fathers Property: తండ్రి ఇంటిని నాదే అంటే కుదరదు, కొడుకులకు తేల్చి చెప్పిన హైకోర్టు