Gold Price Today: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర, తులం పసిడి ధర ఎంతంటే..?

Published : Jul 16, 2022, 10:36 AM IST
Gold Price Today: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర, తులం పసిడి ధర ఎంతంటే..?

సారాంశం

Gold Rates Today: శనివారం  బంగారం ధర తగ్గింది. ఢిల్లీ సరాఫా బజార్ రేట్ల ప్రకారం చూస్తే 24 క్యారెట్లు, 22 క్యారెట్‌లకు చెందిన పదిగ్రాముల బంగారం ధర రూ.160 తగ్గింది. శనివారం నాటికి భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.50,400 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.46,170గా ఉంది. శుక్రవారం 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.50,560 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.46,320గా ఉంది.

Gold Rates Today: ఈరోజు హైదరాబాద్ లో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.51,285 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) రూ.47,927గా ఉంది. ఏపీ రాజధాని విజయవాడలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.51,730 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ.46,500గా ఉంది. బెంగుళూరులో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.50,730 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ.46,500గా ఉంది.

అదే సమయంలో ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.50,730 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.46,500గా నమోదయ్యింది. 

ఏపీలోని ప్రముఖ బంగారం కేంద్రం ప్రొద్దుటూరులో శనివారం 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.50,730 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.46,500గా ఉంది. గత 24 గంటల్లో 24 క్యారెట్ల (10 గ్రా), 22 క్యారెట్ల (10 గ్రా) బంగారం ధర రూ.430 తగ్గింది.

ఇదిలా ఉంటే బంగారంపై దిగుమతి సుంకాన్ని పెంచుతున్నందున రానున్న రోజుల్లో బంగారం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బంగారం ఖరీదయ్యే ముందు ఇప్పుడే కొనడం మంచిది. గత కొద్ది కాలంగా, బంగారం ధరలలో చిన్న హెచ్చుతగ్గులు ఉన్నాయి, దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్‌లో సంభవించే మార్కెట్ సంబంధిత విషయాలు, ద్రవ్యోల్బణం. ముడి చమురు ధరల పెరుగుదల సహా ఇతర ప్రపంచ కారకాలు ఉన్నాయి. 

బంగారానికి అన్ని దేశాల్లో గుర్తింపు ఉంది
ఇప్పటికీ, బంగారం విలువ ప్రపంచ మార్కెట్‌లో బుల్లిష్ గానే ఉంది అనేక దేశాల్లో విదేశీ మారక ద్రవ్యం రూపంలో బంగారం నిల్వలు చేసుకుంటాయి.  ఇక మొదటి నుంచి భారతదేశంలో బంగారానికి ఉన్న ప్రత్యేకత వేరు. వివాహం నుండి అనేక ఇతర శుభ కార్యక్రమాల వరకు, భారతీయులు బంగారాన్ని పెట్టుబడి ఉపయోగిస్తారు. 

బంగారం మంచి పెట్టుబడి
గత కొన్నేళ్లుగా బంగారం ద్రవ్యోల్బణానికి రక్షణగా పనిచేస్తోందని చెప్పవచ్చు. పెట్టుబడిదారులు బంగారాన్ని ఒక ముఖ్యమైన పెట్టుబడి పదార్థంగా చూస్తున్నారు. అందుకే, బంగారం మార్కెట్‌లో మంచి పెట్టుబడి సాధనంగా గుర్తింపు పొందింది. ఈ రోజు బంగారంలో పెట్టుబడి పెట్టడం చాలా సురక్షితమైన పెట్టుబడి అని చాలా మంది నిపుణులు అంటున్నారు. కాబట్టి ముఖ్యంగా భారతీయులకు బంగారం ఆకర్షణ కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు.

PREV
click me!

Recommended Stories

New Labour Codes : కొత్త లేబర్ కోడ్స్ తో మీ జీతం తగ్గుతుందా? కేంద్రం చెప్పిందేంటో తెలుసా!
Post office: నెల‌కు రూ. 5 వేలు ప‌క్క‌న పెడితే.. రూ. 8.5 ల‌క్ష‌లు సొంతం చేసుకోవ‌చ్చు