Gold and Silver Rates Today: ప‌రుగులు పెడుతున్న ప‌సిడి.. వెండి మాత్రం..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 04, 2022, 10:29 AM IST
Gold and Silver Rates Today: ప‌రుగులు పెడుతున్న ప‌సిడి.. వెండి మాత్రం..!

సారాంశం

శుక్రవారం దేశీయంగా పరిశీలిస్తే బంగారం ధర పెరిగింది. తులం బంగారంపై రూ.300 నుంచి రూ.700 వరకు పెరుగుదల ఉంది. అయితే ప్రాంతాలను బట్టి ధర పెరిగింది. అయితే కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా పెరిగితే.. కొన్ని ప్రాంతాల్లో స్థిరంగా ఉన్నాయి.  

బంగారం ధర గత కొద్దిరోజులుగా పెరుగుతోంది. ఇవాళ మరోసారి భారీగానే పెరుగుదల నమోదైంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. బంగారం ధరల పెరుగుదలకు వివిధ కారణాలుంటాయి. కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు, డాలర్ విలువ, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్ వంటివి ప్రభావం చూపిస్తుంటాయి. అందుకే బంగారం ధర ప్రతిరోజూ మారుతుంటుంది. ఇవాళ బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. దేశంలోని వివిధ నగరాల్లో పది గ్రాముల బంగారంపై 3 వందల నుంచి 7 వందల వరకూ పెరిగింది. 

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం (Gold Rate)10 గ్రాముల ధర రూ. 45, 100 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 49, 050 రూపాయలుంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 45, 100 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 49, 200లుగా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 45, 500 రూపాయలుండగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 49, 650 రూపాయలుంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర రూ. 45, 100 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 49, 200 రూపాయలుంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 45, 100 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 49, 200 రూపాయలుంది. 

ఇక‌పోతే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం (Hyderabad Gold Rate) 10 గ్రాముల ధర రూ. 45, 100 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 49, 200 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 45, 100 రూపాయలుంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 49, 200గా ఉంది. ఇక విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. 

వెండి ధరలు

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 61,400లుగా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 61,400లుగా కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 65,600లుగా ఉంది. కోల్‌కతాలో కిలో వెండి ధర 61,400లుగా ఉంది. కేరళలో కిలో వెండి ధర 65,500 లుగా కొనసాగుతోంది. ఇక‌పోతే.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 65,600గా ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ. 65,600గా ఉంది.
విశాఖపట్నంలో కూడా ఇదే ధ‌ర కొన‌సాగుతోంది.
 

PREV
click me!

Recommended Stories

India US Relations : తగ్గేదేలే ! రష్యా చమురుపై అమెరికాకు ఇండియా మాస్ వార్నింగ్
Stock: కండోమ్ కంపెనీ కాసుల వర్షం కురిపించిందిగా.. రూ. లక్షను ఏకంగా రూ. 38 లక్షలుగా మార్చింది..