జెఫ్ బెజోస్ లక్షల కోట్ల షిప్ కోసం పురాతన వంతెన కూల్చివేత.. ఈ సూపర్‌యాచ్‌ ప్రత్యేకత ఏంటి..?

Ashok Kumar   | Asianet News
Published : Feb 04, 2022, 02:44 AM IST
జెఫ్ బెజోస్ లక్షల కోట్ల షిప్ కోసం పురాతన వంతెన కూల్చివేత..  ఈ సూపర్‌యాచ్‌ ప్రత్యేకత ఏంటి..?

సారాంశం

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కోసం నిర్మించిన సూపర్‌యాచ్ కోసం నెదర్లాండ్స్‌లోని చారిత్రాత్మక వంతెనలో కొంత భాగాన్ని కూల్చివేస్తామని అధికారులు గురువారం తెలిపారు. 95 ఏళ్ల నాటి  ఈ వంతెన మధ్య భాగాన్ని ఈ వేసవిలో తొలగిస్తామని, తద్వారా  ఈ సూపర్‌యాచ్ సముద్రానికి వెళ్తుందని రోటర్‌డామ్ నగర ప్రతినిధి చెప్పారు.

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల టాప్ 10 జాబితాలో ఒకరు, అయితే అతని విలాసవంతమైన జీవితం  ఎప్పుడు చర్చనీయాంశంగా ఉంటుంది. తాజాగా జెఫ్ బెజోస్ చెందిన సూపర్‌యాచ్ కోసం నెదర్లాండ్స్‌లోని 100 ఏళ్ల నాటి వంతెనను విచ్ఛిన్నం చేయనున్నట్లు వార్తలు తెరపైకి వచ్చింది. 

  ఈ సూపర్‌యాచ్‌ ప్రత్యేకత ఏంటి.. దీని కోసం చారిత్రక బ్రిడ్జిని కూల్చివేస్తున్నారా అన్న ఆసక్తి జనాల్లో నెలకొంది.  జెఫ్ బెజోస్ ఈ విలాసవంతమైన సూపర్‌యాచ్‌ను నెదర్లాండ్స్‌కు చెందిన ఓషియానో ​​కంపెనీ తయారు చేసింది. ఈ నౌక దాదాపు 417 అడుగుల (127 మీ) పొడవు, 130 అడుగుల ఎత్తు ఉంటుంది. అంటే, ప్రపంచంలోని ఎన్నో పెద్ద వంతెనలు దాని ఎత్తుకు అడ్డుగా రావచ్చు. ఈ ఎత్తు కారణంగా నెదర్లాండ్స్‌లోని రోటర్‌డామ్ నగర మేయర్ ఈ చారిత్రక వంతెనను కూల్చివేయాలని నిర్ణయించారు. 

డచ్ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం, రోటర్‌డ్యామ్ నగరంలో ఉన్న ఈ వంతెన మధ్యలో  నుండి సూపర్‌యాచ్‌ను బయటకు తీసుకేళ్లేందుకు తాత్కాలికంగా కూల్చివేయనున్నారు. అయితే, నెదర్లాండ్స్‌లోని ఈ వంతెనని జాతీయ వారసత్వంగా ప్రకటించబడినందున 2014, 2017లో పునరుద్ధరణ అనంతరం మళ్లీ కూల్చివేయబోమని ప్రభుత్వ అధికారులు తెలిపారు.  

వంతెన కూల్చివేతకు  
 ఈ సూపర్‌యాచ్‌ సముద్రానికి వెళ్లడానికి ఇదే ఏకైక మార్గం అని రోటర్‌డామ్ మేయర్ ప్రతినిధి చెప్పారు. ఈ బ్రిడ్జ్ కూల్చివేత నిర్మాణంకు సంబంధించిన ఖర్చులు బిలియనీర్ బెజోస్ చెల్లిస్తారని ఆయన చెప్పారు. బోట్‌ను నిర్మించడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు, ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్న మేయర్ కార్యాలయం ఈ వంతెనను ప్రస్తుత రూపంలోనే పునర్నిర్మిస్తామని చెప్పరు.

ఈ బ్రిడ్జ్ 1878 నాటిది, రెండవ ప్రపంచ యుద్ధం 1940లో నాజీస్ లచే బాంబు దాడికి గురైన తర్వాత పునర్నిర్మించబడింది. జెఫ్ బెజోస్ మెగాయాచ్‌ ధర సుమారు 430 మిలియన్ యూరోలు.

 రోటర్‌డ్యామ్ మేయర్ ప్రతినిధి మాట్లాడుతూ, వంతెనను కూల్చివేసే బిల్లును  జెఫ్ బెజోస్ చెల్లిస్తున్నారని, తన సూపర్‌యాచ్‌ను సముద్రంలోకి తీసుకెళ్లడానికి ఇది ఏకైక మార్గం కాబట్టి చారిత్రాత్మక వంతెనలో తాత్కాలిక మార్పులు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. 40-మీటర్ల (130-అడుగులు) ఎత్తైన పడవకు వెళ్లేందుకు తగినంత స్థలం ఇవ్వడానికి భారీ స్టీల్-గీర్డర్ వంతెన మధ్య భాగాన్ని తొలగించనున్నట్లు డచ్ మీడియా కూడా నివేదించింది. ఈ ప్రక్రియ వేసవిలో ప్రారంభమవుతుంది అలాగే పూర్తి కావడానికి కొన్ని వారాలు పట్టే అవకాశం ఉంది.

చారిత్రాత్మక నిర్మాణాన్ని ప్రభావితం చేసే నిర్ణయం నెదర్లాండ్స్‌లోని కొందరికి నచ్చలేదు, ఎందుకంటే లోకల్ కౌన్సిల్ 2017లో  పునర్నిర్మాణం తర్వాత రోటర్‌డామర్స్‌ని డి హెఫ్ (De Hef)అని పిలువబడే వంతెనను మళ్లీ ఎప్పటికీ కూల్చివేయమని వాగ్దానం చేసింది. బోట్ ఇంటర్నేషనల్ ప్రకారం Y721గా పిలువబడే ఈ సూపర్‌యాచ్‌ ప్రపంచంలోనే అతిపెద్దది . హెలికాప్టర్ ల్యాండింగ్ ప్యాడ్‌తో పాటుగా విలాసవంతమైన ఫీచర్లు  ఇందులో ఉన్నాయని పుకార్లు కూడా ఉన్నాయి.

PREV
click me!

Recommended Stories

Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !
Post office: రిటైర్మైంట్ త‌ర్వాత బిందాస్‌గా బ‌త‌కొచ్చు.. నెల‌కు రూ. 10 వేలు వ‌చ్చే బెస్ట్ స్కీమ్