Gold And Silver Prices Today: పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు.. నేటి రేట్లు ఇవే..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 18, 2022, 09:43 AM IST
Gold And Silver Prices Today: పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు.. నేటి రేట్లు ఇవే..!

సారాంశం

గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాల వ‌ల‌న‌ బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతోంది. ప్రస్తుతం దేశంలో బంగారం, వెండి ధరలు పైకి కింద‌కి క‌దులుతున్నాయి. బంగారం, వెండి ధ‌ర‌లు వివిధ అంశాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది.

ఉక్రెయిన్‌, రష్యాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణ ప్రభావం ఇతర దేశాలపై భారీగానే పడింది. ముఖ్యంగా బ్యారెల్ ధర, తులం బంగారం ధర రోజురోజుకూ పెరుగుతూ వచ్చాయి. ఉక్రెయిన్‌, రష్యాల నుంచి దిగుమతి ఎక్కువగా ఉండే భారత్‌లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. యుద్ధం మొదలయ్యాక బంగారం ధరలు ఆల్‌టైమ్‌ హైకి చేరుకున్నాయి. ఓ సమయంలో 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 53 వేలకు పైగా వెళ్లింది. అయితే గత 3-4 రోజులుగా గోల్డ్ రేట్స్ తగ్గుతూ వస్తున్నాయి. శుక్ర‌వారం మాత్రం స్వల్పంగా పెరిగాయి. 

అంతర్జాతీయంగా బంగారం, వెండి డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం డిమాండ్, వడ్డీ రేట్లు, వివిధ దేశాల మధ్య భౌగోళిక పరిస్థితులు, కరోనా మహమ్మారి, డాలర్ విలువ వంటివి ప్రభావం చూపిస్తుండటం వల్ల బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. శుక్రవారం (మార్చి 18, 2022) బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ.47,450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,760 గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.150, 24 క్యారెట్లపై రూ.160 మేర పెరిగింది. మరోవైపు వెండి ధరలు రూ. 2100 మేర పెరిగాయి. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ.69,000గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,450 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,760గా ఉంది. ఆర్థిక రాజ‌ధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,450 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,760గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,140గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.52,510 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,450.. 24 క్యారెట్ల ధర రూ.51,760గా నమోదైంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.47,450 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,760గా ఉంది.

ఇక‌పోతే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,450 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,760గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.47,450 ఉండ‌గా.. 24 క్యారెట్ల ధర రూ.51,760గా నమోదైంది. ఇక విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.47,450 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,760 వద్ద కొనసాగుతోంది. 

వెండి ధ‌ర‌లు
మరోవైపు వెండి ధర భారీగా పెరిగింది. గురువారంతో పోల్చితే ఏకంగా రూ. 2100 పెరిగింది. వెండి ధరలు
తాజాగా (శుక్ర‌వారం) ఢిల్లీలో కిలో వెండి ధర రూ.69,000 ఉండగా, ఆర్థిక రాజ‌ధాని ముంబైలో రూ.69,000గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.72,900 ఉండగా, కోల్‌కతాలో రూ.69,000గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.72,900 ఉండగా, కేరళలో రూ.72,900గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.72,900 ఉండగా, విజయవాడలో రూ.72,900 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో ఇదే ధ‌ర కూడా కొన‌సాగుతోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

OYO Meaning: ఓయో అంటే అసలు అర్థం ఏమిటి? ఇది ఎందుకు సక్సెస్ అయిందో తెలిస్తే మైండ్ బ్లో అవుతుంది
Fathers Property: తండ్రి ఇంటిని నాదే అంటే కుదరదు, కొడుకులకు తేల్చి చెప్పిన హైకోర్టు