
Rakesh Jhunjhunwala: స్టాక్ మార్కెట్లు మళ్లీ పుంజుకున్నాయి. గురువారం మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. అయినప్పటికీ ఉక్రెయిన్ యుద్ధ భయాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. అయితే మేజర్ సెక్టార్స్ మాత్రమే కాకుండా కొన్ని సెలక్టివ్ స్టాక్స్ కూడా ఇన్వెస్టర్లకు మంచి రాబడిని అందిస్తుంటాయి. అలాంటి స్టాక్స్ పై ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు చెబుతున్నారు. ఏస్ ఇన్వెస్టర్ రాకేష్ జున్ జున్ వాలా (Rakesh Jhunjhunwala), దమానీ లాంటి వాళ్ల పోర్టు ఫోలియోలను ఎప్పటి కప్పుడు గమనిస్తుండాలని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు.
కరోనా కేసుల తీవ్రత తగ్గే కొద్దీ ప్రపంచ వ్యాప్తంగా అన్‌లాక్ ప్రక్రియ నడుస్తోంది. లాక్-డౌన్‌లో విధించిన పరిమితుల కారణంగా ఎక్కువగా నష్టపోయిన హాస్పిటాలిటీ స్టాక్స్ పై మార్కెట్ నిపుణులు ఇప్పుడు చాలా బుల్లిష్‌గా ఉన్నారు. డెల్టా కార్ప్ (Delta Corp share) వంటి నాణ్యమైన హాస్పిటాలిటీ స్టాక్‌లు దీర్ఘకాలికంగా మంచి రిటర్నులను అందించే వీలుంది. డెల్టా కార్ప్ షేర్లు స్వల్పకాలంలో రూ.310 స్థాయికి చేరుకోవచ్చని మార్కెట్ నిపుణుల అంచనా. అంతేకాదు ఈ స్టాక్ రాకేష్ జున్‌జున్‌వాలా పోర్టు ఫోలియోలో సైతం ఉంది. అతి త్వరలోనే డెల్టా కార్ప్ షేర్ కొత్త గరిష్ట స్థాయికి వెళ్లవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. బుధవారం మార్కెట్ ముగిసే సమయానికి ఈ స్టాక్ రూ. 285 వద్ద ముగిసింది.
పొజిషనల్ ఇన్వెస్టర్లు డెల్టా కార్పొరేషన్‌ను కొనుగోలు చేసుకోవచ్చు...
ముదిత్ గోయల్, SMC గ్లోబల్ సెక్యూరిటీస్ మాట్లాడుతూ, "చార్ట్ ప్యాటర్న్‌లో డెల్టా కార్ప్ స్టాక్ (Delta Corp share price) సానుకూలంగా కనిపిస్తోంది. రాకేష్ జున్‌జున్‌వాలా పోర్ట్‌ఫోలియోలోని ఈ స్టాక్‌ను ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం రూ. 310 తక్షణ లక్ష్యంతో రూ. 266 వద్ద స్టాప్ లాస్‌తో కొనుగోలు చేయవచ్చు. " అని సూచించారు.
డెల్టా కార్ప్ ఫండమెంటల్స్ గురించి ప్రాఫిట్‌మార్ట్ సెక్యూరిటీస్‌కి చెందిన అవినాష్ గోరక్షకర్ వ్యాఖ్యానిస్తూ, డెల్టా కార్ప్ షేర్లు ఇటీవలి సెషన్లలో ఇన్వెస్టర్లను బాగా ఆకర్షించాయి. స్టాక్ మార్కెట్ ఇటీవల క్షీణించినప్పటికీ ఈ స్టాక్ మాత్రం బలంగా రిటర్నులను అందించింది. ఈ హాస్పిటాలిటీ స్టాక్ ముఖ్యంగా కరోనా అనంతరం అన్‌లాక్ థీమ్ కారణంగా ఇన్వెస్టర్లను బాగా ఆకర్షిస్తున్నాయి. ఇంతే కాదు క్యాసినో వ్యాపారం చేస్తున్న కంపెనీగా పేరొందిన డెల్టా కార్ప్, ఈ విభాగంలో స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన ఏకైక కంపెనీగా పేరొందింది. హాస్పిటాలిటీ రంగం పుంజుకోవడంతో, కంపెనీ వ్యాపార వాల్యూమ్‌లు పుంజుకున్నాయని నిపుణులు భావిస్తున్నారు.
ప్రాఫిట్‌మార్ట్ సెక్యూరిటీస్‌కు చెందిన అవినాష్ గోరక్షకర్ మాట్లాడుతూ, రూ. 310 స్థాయిలో స్టాక్‌కు రెసిస్టెన్స్ ఉందని, అయితే రూ. 244 స్థాయిలో ముఖ్యమైన సపోర్ట్ ఉందని తెలిపారు. స్టాక్ ఈ రూ. 310 అడ్డంకిని దాటిన తర్వాత, దీర్ఘకాలంలో ఈ స్టాక్ కొత్త గరిష్టాన్ని తాకేందుకు ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు.
డెల్టా కార్పొరేషన్‌లో రాకేష్ ఝున్‌జున్‌వాలా వాటా ఇదే..
Q3 త్రైమాసికానికి డెల్టా కార్ప్ షేర్ల పాటర్న్ ప్రకారం, రాకేష్ జున్‌జున్‌వాలా, అతని భార్య రేఖా జున్‌జున్‌వాలా కంపెనీలో షేర్లు ఉన్నాయి. డెల్టా కార్ప్‌లో రాకేష్ జున్‌జున్‌వాలా 1.15 కోట్ల షేర్లు, 4.31 శాతం వాటాను కలిగి ఉండగా, రేఖా జున్‌జున్‌వాలా కంపెనీలో 85 లక్షల షేర్లు లేదా 3.18 శాతం వాటాను కలిగి ఉన్నారు. ఆ విధంగా జున్‌జున్‌వాలా దంపతులు డెల్టా కార్ప్‌లో 2 కోట్ల షేర్లను కలిగి ఉన్నారు, ఇది కంపెనీ మొత్తం జారీ చేసిన చెల్లింపు మూలధనంలో 7.49 శాతంగా ఉంది.