Gold And Silver Prices Today: భారీగా తగ్గిన ధ‌ర‌లు.. నేటి బంగారం, వెండి ధ‌రలివే..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 15, 2022, 09:49 AM IST
Gold And Silver Prices Today: భారీగా తగ్గిన ధ‌ర‌లు.. నేటి బంగారం, వెండి ధ‌రలివే..!

సారాంశం

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉంటోంది. అయితే గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు మంగ‌ళ‌వారం మాత్రం దిగి వచ్చాయి. మంగ‌ళ‌వారం బంగారం, వెండి ధ‌ర‌లు ఎలా ఉన్నాయో చూద్దాం..!  

ఉక్రెయిన్‌, రష్యాల దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణ ప్రభావం ఇతర దేశాలపై భారీగానే పడింది. బ్యారెల్ ధర, తులం బంగారం ధర రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్‌, రష్యాల నుంచి దిగుమతి ఎక్కువగా ఉండే భారత్‌లో దీని ప్రభావం తీవ్రంగానే పడింది. ఇటీవలి కాలంలో బంగారం ధరలు ఏకంగా ఆల్‌టైమ్‌ హైకి చేరుకున్నాయి. దీంతో 10 గ్రాముల గోల్డ్ రేట్ దాదాపుగా రూ. 53 వేలు అయింది. అయితే మంగ‌ళ‌వారం (మార్చి 15 2022) బంగారం ధ‌ర‌లు కాస్త తగ్గాయి. 

దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. దేశీయంగా 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా రూ. 400లకు పైగా తగ్గింది. ఇక దేశీయ మార్కెట్లో వెండి ధర కూడా భారీగానే దిగి వచ్చింది. దేశీయంగా కిలో వెండిపై ఏకంగా రూ.4,700 వేలకు పైగా తగ్గింది. అంతర్జాతీయంగా బంగారం, వెండి డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం డిమాండ్, వడ్డీ రేట్లు, వివిధ దేశాల మధ్య భౌగోళిక పరిస్థితులు, కరోనా మహమ్మారి, డాలర్ విలువ వంటివి ప్రభావం చూపిస్తుండటం వల్ల బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి.  ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో మంగ‌ళ‌వారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.52,470గా ఉంది. ఆర్థిక రాజ‌ధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.52,470గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,690గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.53,120 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,100.. 24 క్యారెట్ల ధర రూ.52,470గా నమోదైంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.48,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.52,470గా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాలైన‌ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,470గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.48,100.. 24 క్యారెట్ల ధర రూ.52,470గా నమోదైంది. ఇక విశాఖపట్నంలో కూడా ఇదే ధ‌ర కొన‌సాగుతోంది. 

వెండి ధ‌ర‌లు
ఇక వెండి ధర భారీగా తగ్గింది. నిన్నటితో పోల్చితే ఏకంగా రూ. 4700 తగ్గింది. తాజాగా ఢిల్లీలో కిలో వెండి ధర రూ.70,000 ఉండగా, ఆర్థిక రాజ‌ధాని ముంబైలో రూ.70,000గా ఉంది. ఇక చెన్నైలో కిలో బంగారం ధర రూ.74,200 ఉండగా, కోల్‌కతాలో రూ.70,000గా ఉంది. బెంగళూరులో కిలో బంగారం ధర రూ.74,200 ఉండగా, కేరళలో రూ.74,200 ఉంది. హైదరాబాద్‌లో కిలో బంగారం ధర రూ.74,200 ఉండగా, విజయవాడలో రూ.74,200 వద్ద కొనసాగుతోంది. ఇక విశాఖపట్నంలో కూడా ఇదే ధ‌ర కొన‌సాగుతోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అవకాడోతో అద్దిరిపోయే ఆదాయం.. ఏడాదికి రూ. 20 లక్షలు మీ సొంతం.. వివరాలు ఇవిగో
మీ చేతిలో రూ. 5 ల‌క్ష‌లున్నాయా.? ఉన్న ఊరిలో ఉంటూ నెల‌కు రూ. 30 వేలు సంపాదించండి.