Petrol Diesel Prices Today: నేటి పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లివే.. త‌గ్గాయా.. పెరిగాయా..?

Published : Mar 15, 2022, 08:50 AM ISTUpdated : Mar 15, 2022, 09:32 AM IST
Petrol Diesel Prices Today: నేటి పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లివే.. త‌గ్గాయా.. పెరిగాయా..?

సారాంశం

హైదరాబాద్‌లో మంగ‌ళ‌వారం (మార్చి 15, 2022) పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. స్థిరంగా ఉంది. దీంతో లీటరుకు పెట్రోల్ ధర రూ. 108.20 వద్దనే కొనసాగుతోంది. డీజిల్ రేటు కూడా స్థిరంగా ఉంది.

ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ఎన్నికల ఫలితాల తర్వాత కూడా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు ఇటీవల భారీగా పెరిగి, ఆ తర్వాత కాస్త శాంతించాయి. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్లుగా కనిపించడంతో ధరలు కాస్త క్షీణించాయి. అయినప్పటికీ నాలుగు నెలల క్రితం ధరతో పోలిస్తే దాదాపు 30 డాలర్లు పెరిగింది. దీపావళి తర్వాత మన వద్ద ధరలు పెరగలేదు. ఆ సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ 70 డాలర్లకు కాస్త పైన ఉంది. ఇటీవల రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో 130 డాలర్లు దాటినప్పటికీ.. ప్రస్తుతం కాస్త తగ్గి 112 డాలర్ల వద్ద ఉంది. నాలుగు నెలల్లో 30 డాలర్లకు పైగా పెరగడంతో మన వద్ద ఫలితాల తర్వాతనైనా ధరలు పెరుగవచ్చునని వార్తలు వచ్చాయి. కానీ ధరలు ఇప్పటికీ స్థిరంగా ఉన్నాయి.

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (IOCL) చమురు ధరలకు సంబంధించి మంగ‌ళ‌వారం (మార్చి 15, 2022) కొత్త ధరలను విడుదల చేశాయి. ధరల్లో ఎలాంటి మార్పులేదు. సాధారణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ధరలను సవరిస్తాయి. మూడు నెలలకు పైగా ధరల్లో మార్పులేదు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇటీవల పైకి, కిందకు కదులుతున్నాయి. ఈ ప్రభావం దేశీయంగా పెట్రోల్, డీజిల్ పైన ఉండనుంది. ఓ వైపు అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరిగాయి.

వివిధ న‌గ‌రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు

- ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 95.41, డీజిల్ లీటర్ కు రూ. 86.67

- చెన్నైలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 101.40, డీజిల్ ధర లీటర్ కు రూ. 91.43

- కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 104.67, డీజిల్ ధర లీటర్ కు రూ. 89.79

- త్రివేండ్రంలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 106.36, డీజిల్ ధర లీటర్ కు రూ. 93.47

- హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 108.20, డీజిల్ ధర లీటర్ కు రూ. 94.62

- విశాఖ‌ప‌ట్నంలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 109.05, డీజిల్ ధర లీటర్ కు రూ. 95.18

- బెంగళూరులో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 100.58, డీజిల్ ధర లీటర్ కు రూ. 85.01

- జైపూర్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 107.01, డీజిల్ ధర  లీటర్ కు రూ. 90.65

- లక్నోలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 95.28, డీజిల్ ధర లీటర్ కు రూ. 86.80

- భువనేశ్వర్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 101.81, డీజిల్ ధర లీటర్ కు రూ. 91.62

- ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.

పెట్రోల్-డీజిల్ ధరలు ప్రతిరోజూ మారుతాయి. ఉదయం 6 గంటలకు సవరిస్తారు.  మీరు రోజువారీ పెట్రోల్, డీజిల్ ధరను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు (How to check diesel petrol price daily). ఇండియన్ ఆయిల్ కస్టమర్లు సిటీ కోడ్‌తో పాటు RSPని 9224992249కి పంపడం ద్వారా, BPCL కస్టమర్‌లు RSPని 9223112222 నంబర్‌కు మెసేజ్ చేయడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అదే సమయంలో, HPCL వినియోగదారులు HP Price అని టైప్ చేసి 9222201122 నంబర్‌కు మెసేజ్  పంపడం ద్వారా ధరను తెలుసుకోవచ్చు.
 

PREV
click me!

Recommended Stories

LPG Price Hike : మళ్లీ పెరగనున్న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు? అసలు కారణం ఇదే
Gold Price Hike: ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్..రూ.3 వేలు పెరిగి షాక్ ఇచ్చిన పసిడి