BSNL Cheapest Plan: బెస్ట్ రీఛార్జ్‌.. రూ.106 రీఛార్జ్ తో 84 రోజుల వ్యాలిడిటీ..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 27, 2022, 04:12 PM IST
BSNL Cheapest Plan: బెస్ట్ రీఛార్జ్‌.. రూ.106 రీఛార్జ్ తో 84 రోజుల వ్యాలిడిటీ..!

సారాంశం

దేశంలోని ప్రైవేట్ టెలికాం కంపెనీలు కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు అనేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అందులో రిలయన్స్ జియా, భారతి ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా ముందు ఉన్నాయి. 

టెలికాం కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రభుత్వరంగ సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) చౌకైన రీఛార్జ్ ప్లాన్స్ ను ప్రవేశపెట్టింది. ప్రైవేట్ సంస్థలైన రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా కంపెనీలకు పోటీగా ప్లాన్స్ ను సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్ ను ప్రవేశపెడుతోంది. కేవలం రూ.106 రీఛార్జ్ ప్లాన్ లో 84 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలోని ప్రైవేట్ టెలికాం కంపెనీలు కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు అనేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అందులో రిలయన్స్ జియా, భారతి ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా ముందు ఉన్నాయి. అయితే ఈ కంపెనీలకు పోటీగా ప్రభుత్వం టెలికాం కంపెనీ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ముందుకు వస్తుంది. ప్రముఖ సంస్థలైన జియా, ఎయిర్ టెల్ లకు గట్టి పోటీని చౌకైన రీఛార్జ్ ప్లాన్స్ ను ప్రవేశపెడుతోంది. వాటి వివరాలను తెలుసుకుందాం. 

BSNL చౌకైన రీఛార్జ్ ప్లాన్

భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తమ కస్టమర్లను ఆకర్షించేందుకు అతి తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం రూ. 106 ప్లాన్ తో 100 నిమిషాల ఉచిత కాలింగ్ తో పాటు 3 జీబీ హైస్పీడ్ ఇంటర్నెట్  ఉచితంగా అందించనున్నారు. ఈ ఉచిత నిమిషాల టాక్ టైమ్ ను లోకల్ తో పాటు STD కాల్స్ కు కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ ప్లాన్ ద్వారా SMS ప్రయోజనాలు రావు. ఈ రీఛార్జ్ ప్లాన్ లో 60 రోజుల బీఎస్ఎన్ఎల్ ప్రత్యేక రింగ్ బ్యాక్ టూన్ సదుపాయం ఉంటుంది. బీఎస్ఎన్ఎల్ లో అతి తక్కువ ధర కలిగిన రూ. 106 రీఛార్జ్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది.

హైస్పీడ్ ఇంటర్నెట్ తో..!

టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) 2021 డిసెంబరులో విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ప్రభుత్వ టెలికాం సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) వినియోగదారుల సంఖ్య 10 లక్షలు దాటింది. మరోవైపు గతేడాది స్వాతంత్ర్య దినోత్సవం నుంచి 4G సేవలను బీఎస్ఎన్ఎల్ ప్రారంభించింది. ఇంటర్నెట్ కనెక్టివిటీని మరింత మెరుగుపరిచేందుకు దేశవ్యాప్తంగా లక్ష టవర్లకు పైగా ఏర్పాట్లు చేయాలని యోచిస్తోంది. 
 

PREV
click me!

Recommended Stories

Post office: రూ. 222తో రూ. 11 ల‌క్ష‌లు.. జ‌స్ట్ వ‌డ్డీ రూపంలోనే రూ. 3.8 ల‌క్ష‌లు పొందొచ్చు
Gold Jewellery: బంగారు ఆభరణాలు అద్దెకు ఇస్తే నెలలో లక్షల రూపాయలు సంపాదించే ఛాన్స్