
మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు రోజురోజుకూ పెరుగుతూ షాకిస్తున్నాయి. బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటు చేసుకుంటాయి. తాజాగా బుధవారం (ఫిబ్రవరి 23, 2022) బంగారం, వెండి ధరలు పెరిగాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్‌లో రూ.46,250 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,460 గా ఉంది. అయితే.. 22 క్యారెట్ల బంగారంపై రూ.350 పెరగగా.. 24 క్యారెట్లపై రూ.410 మేర పెరిగింది. కాగా.. వెండి ధరలు కూడా తాజాగా రూ.400 మేర పెరిగాయి. అంతర్జాతీయంగా బంగారం డిమాండ్, డాలర్ విలువ, ద్రవ్యోల్బణం, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు, కరోనా మహమ్మారి, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు వంటివి ప్రధానంగా బంగారం, వెండిలపై ప్రభావం చూపిస్తుంటాయి. అందుకే బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో నేటి (ఫిబ్రవరి 23, 2022) బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
వివిధ నగరాల్లో నేటి బంగారం ధరలివే
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,460 లుగా ఉంది.
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,460గా ఉంది.
- చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,620 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.52,000 వద్ద కొనసాగుతోంది.
- బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,460గా ఉంది.
- కేరళలో 22 క్యారెట్ల ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,460 వద్ద కొనసాగుతోంది.
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,460 వద్ద కొనసాగుతోంది.
- విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,460గా ఉంది.
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,460గా ఉంది.
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.64,400 గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.64,400 ఉండగా.. చెన్నైలో కిలో వెండి ధర రూ.69,100 ఉంది. బెంగళూరు. కేరళలో కిలో వెండి ధర రూ.70,000గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.70,000, విజయవాడలో రూ.70,000, విశాఖపట్నంలో రూ.70,000 వద్ద కొనసాగుతుంది.