Gold And Silver Price Today: బంగారం కొనేవారికి మంచి ఛాన్స్‌.. మ‌రోసారి పతనమైన ధరలు..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jun 16, 2022, 08:19 AM IST
Gold And Silver Price Today: బంగారం కొనేవారికి మంచి ఛాన్స్‌.. మ‌రోసారి పతనమైన ధరలు..!

సారాంశం

బంగారం ధర పడిపోయింది. పసిడి రేటు వరుసగా రెండో రోజు కూడా వెలవెలబోయింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. జూన్ 16న హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర రూ. 270 పడిపోయింది. దీంతో పసిడి రేటు రూ. 51,440కు తగ్గింది. ఇంకా 22 క్యారెట్ల బంగారం రేటు అయితే రూ. 250 దిగొచ్చింది. 10 గ్రాములకు రూ. 47,150కు క్షీణించింది.   

బంగారం ధర పడిపోయింది. పసిడి రేటు వరుసగా రెండో రోజు కూడా వెలవెలబోయింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. జూన్ 16న హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర రూ. 270 పడిపోయింది. దీంతో పసిడి రేటు రూ. 51,440కు తగ్గింది. 24 క్యారెట్ల ప‌సిడికి ఇది వర్తిస్తుంది. ఇంకా 22 క్యారెట్ల బంగారం రేటు అయితే రూ. 250 దిగొచ్చింది. 10 గ్రాములకు రూ. 47,150కు క్షీణించింది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.66,000గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధ‌ర‌లు గురువారం ఈ విధంగా ఉన్నాయి. ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక గురువారం (జూన్ 16, 2022) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..! 

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,170 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,440గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,200 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,500గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,150 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.51,440 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,440గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,170 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,440గా ఉంది.

ఇక‌పోతే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.47,150 వద్ద కొనసాగుతోంది. ఇటు 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.51,440గా నమోదైంది. విజయవాడలో కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.47,150 వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.51,440గా ఉంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతోన్నాయి.

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 60,000 ఉండగా, ముంబైలో రూ.60,000గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.66,000 ఉండగా, కోల్‌కతాలో రూ.60,000గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.66,000 ఉండగా, కేరళలో రూ.66,000గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.66,000 ఉండగా, విజయవాడలో రూ.66,000 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. అయితే ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Gold Rate : గూగుల్, న్యూస్ ధరలు కాదు.. రియల్ టైమ్ బంగారం రేటు కచ్చితంగా తెలుసుకోవడం ఎలాగంటే..
Gold : టీ తాగిన రేటుకే తులం బంగారం.. ఈ దేశం పేరు తెలిస్తే షాక్ అవుతారు !