Fixed Deposit Interest Rates: క‌స్ట‌మ‌ర్ల‌కు గుడ్ న్యూస్ చెప్పిన‌ హెచ్‌డీఎఫ్‌సీ..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jun 15, 2022, 04:02 PM IST
Fixed Deposit Interest Rates: క‌స్ట‌మ‌ర్ల‌కు గుడ్ న్యూస్ చెప్పిన‌ హెచ్‌డీఎఫ్‌సీ..!

సారాంశం

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజాగా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త వడ్డీ రేట్లు ఈరోజు నుంచే అమలులోకి వస్తాయి. దీంతో బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఊరట కలుగనుంది. గతంలో కన్నా ఇకపై కస్టమర్లకు అధిక వడ్డీ లభిస్తుంది. రేట్ల పెంపు నేపథ్యంలో ఏ ఏ టెన్యూర్లలోని డిపాజిట్లపై ఎలాంటి వడ్డీ రేటు ఉందో ఒకసారి తెలుసుకుందాం.  

ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా తాజాగా ఎస్‌బీఐ దారిలోనే పయనించింది. హెచ్‌డీఎఫ్‌సీ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వివిధ కాల పరిమితుల్లోని ఎఫ్‌డీలపై రేట్లు పెరిగాయి. రూ. 2 కోట్లకులోపు డిపాజిట్లకు ఈ రేట్ల పెంపు వర్తిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం.. ఎఫ్‌డీ రేట్లు 25 బేసిస్ పాయింట్ల వరకు పెరిగాయి. కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్లు రేట్లు జూన్ 15 నుంచి అంటే ఈరోజు నుంచే అమలులోకి వస్తాయి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రకారం.. 7 రోజుల నుంచి 14 రోజుల ఎఫ్‌డీలపై 2.5 శాతం వడ్డీ ఉంది. 15 నుంచి 29 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లకు కూడా ఇదే వడ్డీ వర్తిస్తుంది. 30 రోజుల నుంచి 90 రోజుల వరకు ఎఫ్‌డీలపై 3 శాతం వడ్డీ వస్తుంది. 91 రోజుల నుంచి 6 నెలలోపు ఎఫ్‌డీలపై 3.5 శాతం వడ్డీ ఉంది. ఆరు నెలల నుంచి 9 నెలలలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 4.65 శాతంగా ఉంది. ఇది వరకు ఈ ఎఫ్‌డీలపై 4.4 శాతం వడ్డీ లభించేది. అలాగే 9 నెలల నుంచి ఏడాదిలోపు ఎఫ్‌డీలపై అయితే 4.65 శాతం వడ్డీ పొందొచ్చు. ఇది వరకు ఈ టెన్యూర్‌లోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.5 శాతం వడ్డీ వచ్చేది. అలాగే ఏడాది నుంచి రెండేళ్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అయితే 5.35 శాతం వడ్డీని సొంతం చేసుకోవచ్చు. ఇది వరకు ఈ ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 5.1 శాతంగా ఉంది.

రెండేళ్ల నుంచి మూడేళ్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అయితే 5.4 శాతం వడ్డీ లిస్తోంది. మూడేళ్ల నుంచి ఐదేళ్లలోపు ఎఫ్‌డీలపై అయితే 5.6 శాతం వడ్డీని సొంతం చేసుకోవచ్చు. అలాగే ఐదేళ్ల నుంచి పదేళ్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అయితే 5.75 శాతం వడ్డీ వస్తుంది. సాధారణ కస్టమర్లకు ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి. అదే సీనియర్ సిటిజన్ అయితే మరింత ఎక్కువ వడ్డీ వస్తుంది. గరిష్టంగా 6.5 శాతం వరకు వడ్డీ రేటు లభిస్తుంది. 5 ఏళ్ల నుంచి పదేళ్ల టెన్యూర్‌లోని ఎఫ్‌డీలకు ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది. మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు అయితే 6.1 శాతం వడ్డీ ఉంది. బ్యాంక్‌కు వెళ్లి కొత్తగా ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ తెరిచే వారికి లేదంటే ఎఫ్‌డీలను రెన్యూవల్ చేసుకునే వారికి ఈ కొత్త రేట్లు వర్తిస్తాయి.

PREV
click me!

Recommended Stories

Gold Prices: మహిళలకు భారీ గుడ్ న్యూస్.. రెండో రోజు తగ్గిన బంగారం, వెండి
OPPO Enco Air5 Pro: నాయిస్ క్యాన్సిలేషన్ నెక్స్ట్ లెవెల్ కిర్రాక్ ఇయర్‌బడ్స్.. OPPO నుంచి దుమ్ములేపే Enco Air5 Pro వచ్చేసింది