Gold And Silver Price Today: ప‌సిడి ప్రియుల‌కు సూప‌ర్ న్యూస్‌.. భారీగా ప‌డిపోయిన ధ‌ర‌లు..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jun 15, 2022, 08:33 AM IST
Gold And Silver Price Today: ప‌సిడి ప్రియుల‌కు సూప‌ర్ న్యూస్‌.. భారీగా ప‌డిపోయిన ధ‌ర‌లు..!

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నిన్నటితో పోలిస్తే నేడు భారీగా తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.47,400గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.51,710గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.66,000గా ఉంది.   

మీరు బంగారం కొనాలనే ఆలోచనలో ఉన్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. పసిడి రేటు భారీగా పడిపోయింది. ఒక్క రోజులో కుప్పకూలింది. రూ. 1000కి పైగా దిగొచ్చింది. దీంతో గోల్డ్ కొనాలనుకునే వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. బుధ‌వారం (జూన్ 15, 2022) హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ. 1050 పతనమైంది. రూ. 51,710కు తగ్గింది. 24 క్యారెట్ల బంగారానికి ఈ రేటు వర్తిస్తుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే దీని రేటు రూ. 960 పడిపోయింది. 10 గ్రాములకు రూ. 47,400కు తగ్గింది. ఇక వెండి ధర నేడు కిలోకు రూ.1,300 తగ్గింది. స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.66,000గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధ‌ర‌లు బుధ‌వారం ఈ విధంగా ఉన్నాయి. ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక బుధ‌వారం (జూన్ 15, 2022) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..! 

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,710గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,550 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,880గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,400 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.51,710 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710గా ఉంది.

ఇక‌పోతే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.47,400 వద్ద కొనసాగుతోంది. ఇటు 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.51,710గా నమోదైంది. విజయవాడలో కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.47,400 వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.51,710గా ఉంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతోన్నాయి.

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 59,800 ఉండగా, ముంబైలో రూ.59,800గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.66,000 ఉండగా, కోల్‌కతాలో రూ.59,800గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.66,000 ఉండగా, కేరళలో రూ.66,000గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.66,000 ఉండగా, విజయవాడలో రూ.66,000 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. అయితే ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Gold Prices: మహిళలకు భారీ గుడ్ న్యూస్.. రెండో రోజు తగ్గిన బంగారం, వెండి
OPPO Enco Air5 Pro: నాయిస్ క్యాన్సిలేషన్ నెక్స్ట్ లెవెల్ కిర్రాక్ ఇయర్‌బడ్స్.. OPPO నుంచి దుమ్ములేపే Enco Air5 Pro వచ్చేసింది