Gold And Silver Price Today: ప‌సిడి ప్రియుల‌కు గుడ్ న్యూస్‌.. తులం బంగారం ఎంతంటే..?

Sreeharsha Gopagani   | Asianet News
Published : May 05, 2022, 07:40 AM ISTUpdated : May 05, 2022, 07:43 AM IST
Gold And Silver Price Today: ప‌సిడి ప్రియుల‌కు గుడ్ న్యూస్‌.. తులం బంగారం ఎంతంటే..?

సారాంశం

బంగారం ధరలు మళ్లీ దిగొచ్చాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.200 తగ్గి రూ.47,000గా ఉంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.230 తగ్గడంతో.. రూ.51,280గా రికార్డైంది.  

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు నిన్నటితో పోలిస్తే భారీగా తగ్గింది. ఏకంగా 10 గ్రాములకు రూ.200 పతనం అయింది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో ఈ మధ్య పెద్ద ఎత్తున మార్పులు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వెండి ధర నేడు (మే 5, 2022) నిలకడగా ఉంది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర హైదరాబాద్‌ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.47,000గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.51,280గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.67,000 కు తగ్గింది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధ‌ర‌లు గురువారం ఈ విధంగా ఉన్నాయి. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు భారీ ఎత్తున పెరిగిన సంగతి తెలిసిందే. ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక గురువారం (మే 5, 2022) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!  

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,280గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.48,100 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,320గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.51,280 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280గా ఉంది.

ఇక‌పోతే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.47,200 వద్ద కొనసాగుతోంది. ఇటు 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.51,510గా నమోదైంది. విజయవాడలో కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.47,200 వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.51,510గా ఉంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతోన్నాయి.

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.62,700 ఉండగా, ముంబైలో రూ.62,700గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.67,000 ఉండగా, కోల్‌కతాలో రూ.62,700గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.67,000 ఉండగా, కేరళలో రూ.67,000గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,000 ఉండగా, విజయవాడలో రూ.67,000 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. అయితే ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Zomato: మాజీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన జొమాటో సీఈవో, ఊహించని స్పందన
Investments: నెల‌కు రూ. 500తో మీ పిల్ల‌లకు బంగారు భ‌విష్య‌త్తు ఇవ్వొచ్చు.. ఈ రోజే ప్రారంభించండి