
పిల్లల నుంచి పెద్దల వరకూ అలరించి భారతీయ కామిక్ కారెక్టర్ చోటా భీమ్ ఈ వేసవిలో కొత్త ప్లాట్ ఫాం ద్వారా పలకరించనుంది. JioGames ద్వారా చోటా భీమ్ వీడియోగేమ్స్ చిన్నారులను అలరించనున్నాయి. గ్రీన్ గోల్డ్ యానిమేషన్ ప్రైవేట్, JioGames ప్లాట్‌ఫాం ద్వారా ఛోటా భీమ్ గేమ్స్ ప్రారంభించనుంది. ఈ వేసవి సెలవులకు మరింత వినోదాన్ని జోడించడానికి ఇది సహకరిస్తుంది. పిల్లలతో పాటుగా గేమింగ్ ఔత్సాహికులు ఇప్పుడు వారికి ఇష్టమైన ఛోటా భీమ్ గేమ్‌ను ఆడుకోవచ్చు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు, జియో సెట్-టాప్ బాక్స్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో జియోగేమ్స్ యాప్ ద్వారా ఈ గేమ్స్ అందుబాటులో ఉన్నాయి.
ఛోటా భీమ్ భారతదేశంలో అత్యంత ఇష్టపడే యానిమేటెడ్ పాత్రలలో ఒకటి. ఈ వేసవి సెలవల్లో పిల్లలకు బోనస్ వినోదాన్ని, ఆనందాన్ని అందిస్తుంది. ఒక దశాబ్ద కాలంగా ఛోటా భీమ్ భారతీయ పిల్లల జీవితాల్లో ఒక భాగంగా మారిపోయాడు. ఇప్పుడు JioGames ప్లాట్ ఫాంలోకి వస్తున్న ఈ వినోదాత్మక గేమ్స్ అభిమానులందరికీ సరికొత్త అనుభవాన్ని అందించనున్నాయి.
ఈ సందర్భంగా గ్రీన్ గోల్డ్ యానిమేషన్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ శ్రీనివాస్ చిలకలపూడి మాట్లాడుతూ. “జియోతో కలిసి పనిచేస్తున్నందుకు, అలాగే జియోగేమ్స్‌లో భాగం కావడానికి చాలా సంతోషిస్తున్నాము. JioGames ద్వారా భారతదేశంలోనే అత్యంత ఇష్టమైన యానిమేటెడ్ షో - ఛోటా భీమ్‌ను పిల్లలకు అందించడం ఒక గొప్ప అవకాశం. చోటా భీం కారెక్టర్ జియో గేమ్స్ ద్వారా మరింతగా కనెక్ట్ అయ్యేలా చేయనుంది. మొదటగా 5 హైపర్ క్యాజువల్ గేమ్‌లతో ప్రారంభిస్తాము, తర్వాత త్వరలో జోడిస్తాము” అని పేర్కొన్నారు.