దిగోస్తున్న బంగారం, వెండి ధరలు నేడు 10గ్రా, ఎంతంటే ?

By Sandra Ashok KumarFirst Published Jul 14, 2020, 11:21 AM IST
Highlights

మునుపటి సెషన్‌లో 3.3 శాతం పెరిగిన వెండి ధర ఎంసిఎక్స్‌ సిల్వర్ ఫ్యూచర్స్ లో వెండి ధర కిలోకు 1.2% పడిపోయి రూ.52,408 చేరుకుంది. ప్రపంచ మార్కెట్లలో ర్యాలీతో బంగారం ధరలు గత వారం 10 గ్రాములకు 49,348 రూపాయల గరిష్టాన్ని తాకింది. గ్లోబల్ మార్కెట్లలో, బంగారు రేట్లు ఈ రోజు కాస్త తగ్గు ముఖం పట్టాయి.

భారతదేశంలో బంగారం ధరలు ఈ రోజు  కూడా పడిపోయాయి. మునుపటి సెషన్‌లో 0.55% పెరిగిన తరువాత ఎంసిఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ లో 10 గ్రాముల బంగారం ధర 0.5% తగ్గి రూ.48,912 చేరుకున్నాయి. వెండి ధర కూడా గరిష్ట స్థాయికి చేరుకుంది.

మునుపటి సెషన్‌లో 3.3 శాతం పెరిగిన వెండి ధర ఎంసిఎక్స్‌ సిల్వర్ ఫ్యూచర్స్ లో వెండి ధర కిలోకు 1.2% పడిపోయి రూ.52,408 చేరుకుంది. ప్రపంచ మార్కెట్లలో ర్యాలీతో బంగారం ధరలు గత వారం 10 గ్రాములకు 49,348 రూపాయల గరిష్టాన్ని తాకింది. గ్లోబల్ మార్కెట్లలో, బంగారు రేట్లు ఈ రోజు కాస్త తగ్గు ముఖం పట్టాయి.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రూ.60 పెరిగి రూ.46,960కు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.60 పెరిగి రూ.51,240 వద్ద నిలిచింది. బంగారంతో పాటు వెండి ధర కూడా రూ.210ల పెరిగి రూ.52,210గా నమోదైయ్యింది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.40 పెరిగి రూ.47,850 వద్ద నిలిచింది.

24 క్యారెట్ల బంగారం ధర రూ.40 పెరిగి రూ.49,050గా నమోదైయింది. వెండి ధర రూ.210 పెరిగి రూ. 52,210 చేరుకుంది. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో మార్పులు, స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును.

also read 

అయితే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరగడంపై ఆందోళనలు నష్టాలను అధిగమించాయి. బంగారం ఔన్స్‌కు 0.2% పడిపోయి 1,798.52 డాలర్లకు చేరుకోగా, యు.ఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.7% పడిపోయి 1,802.20 డాలర్లకు చేరుకుంది.

ఇతర విలువైన లోహాలలో ప్లాటినం ధర 0.6% పెరిగి 833.14 డాలర్లకు చేరుకోగా, వెండి 0.1% తగ్గి 19.07డాలర్లకు చేరుకుంది. యు.ఎస్-చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు కూడా బంగారానికి మద్దతు ఇచ్చాయి.  రాజకీయ, ఆర్థిక అనిశ్చితి కాలంలో బంగారాన్ని తరచుగా విలువైన సురక్షిత నిల్వగా ఉపయోగిస్తారు.

బలమైన పెట్టుబడి డిమాండ్‌ను ప్రతిబింబిస్తూ, ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్-సపోర్ట్ గల ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్ లేదా గోల్డ్ ఇటిఎఫ్ ఎస్‌పిడిఆర్ గోల్డ్ ట్రస్ట్ 0.3% పెరిగి 1,203.97 టన్నులకు చేరుకున్నాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా, 1.3 కోట్లకు పైగా ప్రజలు కరోనా వైరస్ బారిన పడ్డారని, 5.7 లక్షల మంది మరణించారని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో పోస్ట్ చేసిన ఒక లెక్క ప్రకారం వెల్లడైంది.  

click me!