Go first republic Day offer: ప్రయాణికులకు బంపరాఫర్.. రూ.926కే విమాన టికెట్​..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 24, 2022, 04:33 PM IST
Go first republic Day offer: ప్రయాణికులకు బంపరాఫర్.. రూ.926కే విమాన టికెట్​..!

సారాంశం

ప్రముఖ బడ్జెట్ విమానయాన సంస్థ గో ఫస్ట్​ సరికొత్త ఆఫర్​ ప్రకటించింది. రిపబ్లిక్​ డే సందర్భంగా వినియోగదరాలను ఆకర్షించేందుకు.. విమాన టికెట్ల ధరలపై భారీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు (Go first new offer) తెలిపింది.

ప్రముఖ బడ్జెట్ విమానయాన సంస్థ గో ఫస్ట్​ సరికొత్త ఆఫర్​ ప్రకటించింది. రిపబ్లిక్​ డే సందర్భంగా వినియోగదరాలను ఆకర్షించేందుకు.. విమాన టికెట్ల ధరలపై భారీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు (Go first new offer) తెలిపింది. 'రైట్​ టూ ఫ్లై' పేరుతో ఈ ఆఫర్​ను తీసుకొచ్చింది గో ఫస్ట్​. ఇందులో రూ.926కే దేశీయ విమాన ప్రయాణానికి టికెట్లు విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. ఇది లిమిటెడ్ ఆఫర్ అని స్పష్టం (Go first latest news) చేసింది.

ఈ అఫర్​ కింద టికెట్ సేల్స్​ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. జనవరి 26 వరకు ఈ ఆఫర్ అందుబాటులో (Go first republic offer last date) ఉండనుంది. ఈ సమయంలో టికెట్ బుక్​ చేసుకున్న ప్రయాణిమకులు.. తమ ప్రయాణ తేదీలను ఫిబ్రవరి 11 నుంచి మార్చి 31 లోపు  అనువైన రోజును ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ ఒకసారి ప్రయాణనికి (వన్​ వే) మాత్రమే వర్తిస్తుంది.

కంపెనీ అధికారిక వెబ్​సైట్​తో పాటు.. ఇతర అన్ని ఛానెల్స్​ ద్వారా బుక్​ చేసుకున్నా ఈ ఆఫర్​ను పొందొచ్చని కంపెనీ పేర్కొంది. ఈ ఆఫర్ ద్వారా విమాన ప్రయాణం చేసే వారికి 15 కిలోల వరకు లగేజీ ఛార్జీలు ఉండవు. టికెట్ క్యాన్సిలెషన్​ సదుపాయం ఉంది. అయితే సాధారణ నిబంధనలు, ఛార్జీలకు లోబడే క్యాన్సిలేషన్​ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణ తేదీకి మూడు రోజుల ముదు వరకు.. పయాణ తేదీని ఉచితంగా (Go first republic offer Terms) మార్చుకోవచ్చు.  
 

PREV
click me!

Recommended Stories

IIFL ఫైనాన్స్ గ్రాము బంగారంపై ఎంత గోల్డ్ లోన్ అందిస్తుందో తెలుసా..?
Gold Price Today: పసిడి ప్రియులకు మండే గుడ్‍న్యూస్...భారీగా పతనమైన బంగారం