మీరు iPhone కొనాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే మీకు Flipkart అదిరిపోయే ఆఫర్‌ను తీసుకొచ్చింది. రూ.79,600 ఉన్న ఐఫోన్ 15 ఇప్పుడు రూ.65,999కే లభిస్తోంది. అంటే దీనిపై ఏకంగా 17% తగ్గింపు ఇస్తోంది. ఇవే కాకుండా ఎక్స్ఛేంజ్ డీల్స్, బ్యాంక్ ఆఫర్ల ద్వారా అదనపు తగ్గింపులను కూడా పొందవచ్చు. ఈ విధంగా మీరు ఊహించనంత తగ్గింపు ధరకు ఐఫోన్ 15 మీ సొంతమవుతుంది. ఆ ధర ఎంతో తెలుసుకుందాం. రండి
వినాయక చవితి పండగను పురస్కరించుకొని ఫ్లిప్‌కార్ట్ వివిధ ప్రోడక్ట్‌లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది. వాటిల్లో ముఖ్యంగా సెల్‌ఫోన్లపై భారీ తగ్గింపులను ప్రకటించింది. వాటిల్లో అతి ముఖ్యమైనది ఐఫోన్ 15పై ఇచ్చిన ఆఫర్. ఐఫోన్ 15 అసలు ధర రూ.79,600 కాగా దీనిపై 17 శాతం తగ్గింపునిచ్చింది. అంటే ఇది కేవలం రూ.65,999కే లభిస్తోంది. దీనిపైనే మరిన్ని ఆఫర్లను ఇచ్చింది. వాటిలో మీకు సరిపోయే ఆఫర్లు ఉంటే చెక్ చేసుకొని భారీ తగ్గింపును పొందవచ్చు.
ఐఫోన్ 15 ఫీచర్స్ ఇవిగో..
ఐఫోన్ 15 ఆకర్షణీయమైన 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED స్క్రీన్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా ఇది డైనమిక్ ఐలాండ్ అసాధారణమైన 2,000nits పీక్ బ్రైట్‌నెస్ కూడా దీని సొంతం. అత్యాధునిక A16 బయోనిక్ చిప్, iOS 17 ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా దీని పనితీరును మెరుగుపరుస్తున్నాయి. ఇక ఫోటోగ్రఫీ విషయానికొస్తే 48 MP ప్రైమరీ కెమెరా, 12 MP సెకండరీ కెమెరా దీనిలో ఉన్నాయి. ఫ్రంట్ లో 12 MP కెమెరా అమర్చారు.
రూ.24,849లకే ఐఫోన్ 15..
ఇక రూ.79,600 విలువైన ఐఫోన్ 15 కేవలం రూ.24,849లకు ఎలా సొంతం చేసుకోవచ్చో తెలుసా.. ఈ ఆఫర్ అందిస్తోంది ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్. ఈ సంస్థ ఇప్పటికే యాపిల్ ఐఫోన్‌పై భారీ ఆఫర్‌లు ప్రకటించింది. అందులో భాగంగా ఐఫోన్ 15(128 GB) ఇప్పుడు రూ.65,999కి లభిస్తోంది.
మీ ఫోన్ ఎక్స్ఛేంజ్ లో ఇస్తే..
ప్రస్తుతం మీరు వాడుతున్న ఫోన్ ఎక్స్ఛేంజ్ లో ఇస్తే మాక్సిమం రూ.40,850 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఎక్స్ఛేంజ్ లో ఇచ్చే ఫోన్ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తూ ఉండాలన్న విషయం మరిచిపోవద్దు. దెబ్బతిన్న ఫోన్ అయితే సరైన ధర పలకదు.
బ్యాంక్ ఆఫర్లు కూడా..
ఎక్స్ఛేంజ్ డీల్స్ తో పాటు కొన్ని బ్యాంకు కార్డుల ద్వారా అదనపు తగ్గింపులు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే మీకు 5% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇవి కాకుండా ఫెడరల్ బ్యాంకు క్రెడిట్ కార్డు, హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకు క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తే ఈఎంఐలలో 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.
అదనపు తగ్గింపు..
ఇవి కాకుండా ప్రత్యేక క్యాష్‌కూపన్ ద్వారా రూ.11,901 తగ్గింపు లభిస్తుంది. ఇలా అన్ని ఆఫర్లు మీరు పొందగలిగితే సుమారు రూ. 52,500 నుంచి రూ.54,751 వరకు తగ్గింపు లభిస్తుంది. అంటే రూ.79,600 విలువైన ఐఫోన్ 15 కేవలం రూ.24,849లకే మీ సొంతమవుతుంది.