
అత్యవసరంగా డబ్బులు కావాలా? అయితే వాట్సాప్ ద్వారా ఇప్పుడు చిటికెలో డబ్బులు పొందవచ్చు. ఇన్‌స్టాంట్ యాప్ WhatsApp తన వినియోగదారులకు 30 సెకన్లలో తక్షణ రుణాన్ని పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ఫైనాన్షియల్ వెల్‌నెస్ ప్లాట్‌ఫామ్ ఫిన్‌టెక్ సంస్థ క్యాష్‌ఈ (CASHe) భాగస్వామ్యంతో వాట్సాప్ ఈ రుణాన్ని అందిస్తోంది. ఈ లోన్ పొందడానికి, వినియోగదారులు ఎలాంటి హామీ పత్రాలను అందించనవసరం లేదు. AI- పవర్డ్ బాట్ ఆటోమేటిక్‌గా KYCని చెక్ చేసి లోన్ ప్రాసెస్ పూర్తి చేస్తుంది. ఇప్పుడే అర్జెంట్‌గా లోన్ ఎలా పొందాలని ఆలోచిస్తున్నారా? అయితే పూర్తి వివరాలను తెలుసుకోండి.
ముందుగా WhatsApp వినియోగదారులు +91 80975 53191 నంబర్‌ను సేవ్ చేసుకోవాలి. తర్వాత, మీరు వాట్సాప్ చాట్ బాక్స్‌లోకి వెళ్లి హాయ్ అని మెసేజ్ టైప్ చేసి పంపాలి. మెసేజ్ పంపిన వెంటనే ప్రీ-అప్రూవ్డ్ లోన్ పొందుతారు. ఈ రుణాన్ని పొందాలంటే ఎలాంటి మొబైల్ అప్లికేషన్లు డౌన్‌లోడ్ చేయడం కానీ.. డాక్యుమెంట్లను సమర్పించడం కానీ ఉండదు.
లోన్ పొందే విధానం..!
- ముందుగా మీ ఫోన్‌లో +91 80975 53191 నంబర్‌ను సేవ్ చేయండి.
- ఇప్పుడు WhatsApp చాట్ బాక్స్‌కి వెళ్లి హాయ్ అని టైప్ చేయండి.
- హాయ్ అని టైప్ చేస్తే, మీరు రెండు ఎంపికలను పొందుతారు. తక్షణ క్రెడిట్, ఇతర ఆప్షన్స్ వస్తాయి.
- లోన్ పొందేందుకు గెట్ ఇన్‌స్టంట్ క్రెడిట్‌పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు పాన్ కార్డ్‌లో పేర్కొన్న పేరును నమోదు చేయండి.
- నగదు గోప్యతా విధానం, నిబంధనలు, షరతులను నిర్ధారించండి.
- ఇప్పుడు మీ పాన్ నంబర్ మీ ముందు కనిపిస్తుంది. దాన్ని నిర్ధారించండి.
- PAN నంబర్ చెక్ చేసిన తర్వాత, DOBని చెక్ చేయడానికి Preceedపై క్లిక్ చేయండి.
- ఇప్పుడు బోట్ మీ KYCని చెక్ చేస్తుంది. దీని కోసం Proceed to Check పై క్లిక్ చేయండి.
- KYC ధృవీకరించబడిన తర్వాత, మీ చిరునామా కనిపిస్తుంది, దాన్ని నిర్ధారించండి.
మొత్తం సమాచారాన్ని చెక్ చేసిన తర్వాత, మీకు రుణం లభిస్తుందో లేదో మీకు తెలియజేయబడుతుంది.