నేడు ప్రముఖ నగరాల్లో స్థిరంగా పెట్రోల్ డీజిల్.. ఏడాది గడుస్తున్నా దిగిరాని ఇంధన ధరలు..

By asianet news telugu  |  First Published May 25, 2023, 10:20 AM IST

  మరికొద్ది రోజుల్లో మే నెల ముగియనుంది. ఇంధన ధరలలో అతిపెద్ద మార్పు  ఒక సంవత్సరం క్రితం మే 2022లో జరిగింది. భారతీయ ఆయిల్ కంపెనీలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు కొత్త ఇంధన  ధరలను విడుదల చేస్తాయి. 


భారతదేశంలోని చాలా నగరాల్లో నేడు ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి, ఒక సంవత్సరం గడుస్తున్న వీటి ధరల్లో పెద్ద మార్పు కనిపించలేదు. మరికొద్ది రోజుల్లో మే నెల ముగియనుంది. ఇంధన ధరలలో అతిపెద్ద మార్పు  ఒక సంవత్సరం క్రితం మే 2022లో జరిగింది. భారతీయ ఆయిల్ కంపెనీలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు కొత్త ఇంధన  ధరలను విడుదల చేస్తాయి.

దేశంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల తాజా లిస్ట్  ప్రకారం  నేటికీ దేశవ్యాప్తంగా పెట్రోల్,  డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు లేదు.  ముడిచమురు ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నప్పటికీ చమురు కంపెనీలు ధరలను స్థిరంగా కొనసాగించాయి. ముడిచమురు ధర పెరిగిన, తగ్గినప్పటికీ పెట్రోలు, డీజిల్ ధరలపై ఎలాంటి ప్రభావం చూపలేదు.

Latest Videos

  25 మే 2022న పెట్రోల్, డీజిల్ తాజా ధరలు -

చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ .102.63 , డీజిల్ ధర రూ .94.24

ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ .106.31 , డీజిల్ ధర రూ .94.27

ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ .96.65 , డీజిల్ ధర రూ .89.82

కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ .106.03 , డీజిల్ ధర రూ .92.76 

 కొన్ని ముఖ్యమైన నగరాలు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో లీటరు పెట్రోల్ ధర రూ .96.57 , డీజిల్ ధర రూ .89.76.   బీహార్ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ .107.24 , డీజిల్ ధర రూ .94.04 గా ఉంది. చండీగఢ్‌లో పెట్రోల్ ధర రూ. 96.20, డీజిల్ ధర లీటరుకు రూ. 84.26 . హైదరాబాద్ (తెలంగాణ)లో ఈరోజు పెట్రోల్ ధర రూ. లీటరుకు 109.66.  డీజిల్ ధర రూ. 97.82 లీటరుకి.

WTI క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు $ 74.20 వద్ద ట్రేడవుతోంది, 0.19 శాతం క్షీణించింది. అంతేకాకుండా, బ్రెంట్ ముడి చమురు బ్యారెల్‌కు 0.03 శాతం తగ్గి 78.31 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

ప్రపంచంలోనే అతి తక్కువ ధరకే పెట్రోల్ 
భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నప్పటికీ, మీరు కేవలం బిస్కెట్ల ధరలకు పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసే కొన్ని దేశాలు ఉన్నాయి. ఈ దేశం సౌదీ అరేబియా కాదు. ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు పెట్రోల్ వెనిజులాలో లభిస్తుంది. అక్కడ పెట్రోలు ధర లీటరుకు రూ .1.48 . ఇరాన్‌లో లీటరు పెట్రోల్ ధర రూ  .4.45 గా ఉంది. ఈ దేశాలతో పోలిస్తే భారత్‌లో పెట్రోల్ ధరలు 100 రెట్లు ఎక్కువ .

 మీరు SMS ద్వారా పెట్రోల్,  డీజిల్ ధరలను చెక్  చేయవచ్చు. HPCL వినియోగదారులు  9222201122కి HPPRICE <డీలర్ కోడ్> అని టైప్ చేసి SMS పంపండి. ఇండియన్ ఆయిల్ వినియోగదారులు  RSP<డీలర్ కోడ్>ని 9224992249కి టైప్ చేసి SMS పంపండి. మరోవైపు, కొత్త ధరలను చెక్  చేయడానికి, BPCL   వినియోగదారులు <డీలర్ కోడ్>ని 9223112222 నంబర్‌కు టైప్ చేసి SMS  పంపాలి. 

click me!