వాహనదారులకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఇంధన ధరలు.. మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు

By asianet news teluguFirst Published Jun 1, 2021, 10:46 AM IST
Highlights

వరుసగా రెండో రోజు కూడా పెట్రోలు, డీజిల్‌ ధరలను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయించాయి. దీంతో మంగళవారం పెట్రోల్‌ ధర పై 26 పైసలు, డీజిల్ ధర పై  23 పైసలు పెరిగింది. 

అంతర్జాతీయ ముడి చమురు ధరల పెరుగుదలతో నేడు ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఒఎంసి) మంగళవారం ఇంధన ధరలను సవరించాయి. గత కొన్ని వారాలుగా ఓ‌ఎం‌సిలు ప్రత్యామ్నాయ రోజులలో మాత్రమే ఇంధన ధరలను పెంచుతున్నాయి.

ప్రపంచ చమురు ధరలు బలంగా పుంజుకోవడంతో ఇంధన ధరల పెరుగుదల మరికొంత కాలం కొనసాగవచ్చు. ఈ వారంలో వరుసగా రెండవ రోజు కూడా  నేడు పెట్రోల్ ధరపై లీటరుకు 26 పైసలు పెరగగా, డీజిల్ ధర పై లీటరుకు 23 పైసలు పెరిగింది.

దీంతో ఇప్పుడు డీజిల్ కూడా లీటరు రూ.100 చేరువలో ఉంది, పెట్రోల్ ధర ఇప్పటికే కొన్ని నగరాల్లో రూ.100 దాటింది. రాజస్థాన్ లోని శ్రీగంగానగర్ లో పెట్రోల్ లీటరుకు  రూ.105 పైగా విక్రయిస్తున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.101కి చేరువైంది. 

దేశ రాజధాని  ఢీల్లీలో మంగళవారం పెట్రోల్ ధర లీటరుకు రూ.94.49 పెరగగా, డీజిల్ కూడా లీటరుకు రూ.85.38కు చేరుకుంది. గత 18 రోజుల్లో  పెట్రోల్  4.17 పైసలు పెరిగింది. అలాగే గత రెండు రోజుల్లో పెట్రోల్ 56 పైసలు పెరగడం గమనార్హం. మరోవైపు, డీజిల్ ధర 18 రోజుల్లో లీటరుకు రూ .4.60 పెరిగింది. గత రెండు రోజుల్లో ఇది 49 పైసలు పెరిగింది.  

also read జూన్ నెలలో రెండవ శని, ఆదివారాలతో బ్యాంకులకు భారీగా సెలవులు.. ఈ తేదీలను గుర్తించుకోండి.. ...

ప్రధాన మెట్రో నగరాల్లో పెట్రోలు, డీజిల్‌ ధరలు  లీటరుకు 

ముంబై  పెట్రోల్‌  ధర రూ.100.72, డీజిల్‌ రూ.92.69

చెన్నై పెట్రోల్ ధర  రూ.95.99, డీజిల్ రూ.90.12

కోల్‌కతా పెట్రోల్ ధర రూ.94.50, డీజిల్ రూ.88.23

బెంగళూరు పెట్రోల్ ధర  రూ.97.64.. డీజిల్ రూ.90.51

హైదరాబాద్‌  పెట్రోల్‌ ధర  రూ.98.20, డీజిల్‌ రూ.93.08
 

click me!