భగ్గుమన్న ఇంధన ధరలు.. నేడు సెంచరీ కొట్టిన పెట్రోల్ ధర.. లీటరుకు ఎంతంటే ?

By asianet news teluguFirst Published May 29, 2021, 10:32 AM IST
Highlights

పెట్రోల్, డీజిల్ ధరలు నేడు మళ్లీ పెరిగాయి. దీంతో మొట్టమొదటిసారి ముంబైలో ఒక లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయలు దాటింది.  పలు రాష్ట్రాల్లో ఈ రోజు పెట్రోల్‌, డీజిల్‌పై 19 నుంచి 30 పైసల పెరుగుదల నమోదైంది. 

నేడు దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి  భగ్గుమన్నాయి. ప్రభుత్వ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరించడంతో డీజిల్ ధర 28 నుండి 30 పైసలకు పెరగగా,   పెట్రోల్ ధర 25 నుండి 26 పైసలకు పెరిగింది. ఇక ముంబైలో తొలిసారిగా పెట్రోల్ ధర రూ.100 దాటింది. పలు రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌పై 19 నుంచి 30 పైసల పెరుగుదల నమోదైంది.  

దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.93.94, డీజిల్‌ రూ.84.89. మే 4 నంచి పెట్రోల్‌, డీజిల్ ధరలు పెరగడం వరుసగా 15వ సారి.  నిన్న పెట్రోల్, డీజిల్ ధరలో ఎటువంటి మార్పు లేదు. అయితే రాజస్థాన్‌లోని శ్రీగంగనగర్, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో పెట్రోల్ ధర ఇప్పటికే రూ. 100 దాటింది.  పెట్రోల్ ధర గత 16 రోజుల్లో లీటరుకు 3.61 పైసలు పెరిగింది.  డీజిల్ ధర కూడా 16 రోజుల్లోరూ. 4.11 పెరిగింది.

also read కరోనా కాలంలో పెరిగిన ఎఫ్‌డిఐల ప్రవాహం.. ఇండియాలో గత ఏడాదితో పోల్చితే 10% ఎక్కువ.. ...


ప్రధాన మెట్రోలలో పెట్రోల్, డీజిల్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

నగరం    డీజిల్    పెట్రోల్

ఢీల్లీ          84.89    93.94
ముంబై     92.17    100.19
కోల్‌కతా    87.74    93.97
చెన్నై       89.65    95.51
హైదరాబాద్     92.54         97.63 

ప్రతి రోజు ఉదయం 6 గంటల నుండి ఇంధన ధరలను సమీక్షిస్తూంటారు.  కొత్త ధరలు ఉదయం 6 నుండి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్ మరియు ఇతర జోడించిన తరువాత, దాని ధర దాదాపు రెట్టింపు అవుతుంది. ఈ  ఆధారంగా చమురు కంపెనీలు రోజూ పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి.

మీ నగరంలో పెట్రోల్ ధర 
పెట్రోల్, డీజిల్ ధరలను ఎస్ఎంఎస్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం, మీరు ఆర్‌ఎస్‌పి అండ్ మీ సిటీ కోడ్‌ను వ్రాసి 9224992249 నంబర్‌కు పంపాలి. ప్రతి నగరానికి కోడ్ భిన్నంగా ఉంటుంది.

click me!