వాహనదారులకు రిలీఫ్.. నేడు స్థిరంగా ఇంధన ధరలు.. పెట్రోల్, డీజిల్ లీటరు ధర చెక్ చేసుకోండీ..

By asianet news teluguFirst Published Nov 5, 2022, 9:26 AM IST
Highlights

ప్రస్తుతం, WTI క్రూడ్ ధర బ్యారెల్‌కు సుమారు $ 88 డాలర్ల వద్ద, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $ 95 డాలర్ల వద్ద ఉంది. భారతీయ చమురు కంపెనీల ప్రకారం ఈ రోజు (శనివారం) నవంబర్ 5 కూడా దేశంలో పెట్రోల్-డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు లేదు.

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలో కాస్త హెచ్చుతగ్గులు ఉన్నప్పటికి చాలా కాలంగా ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు లేదు. మే 22న కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన సంగతి మీకు తెలిసిందే. అప్పటి నుంచి దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.96.72, డీజిల్ ధర రూ.89.62 వద్ద స్థిరంగా ఉంది.

ప్రస్తుతం, WTI క్రూడ్ ధర బ్యారెల్‌కు సుమారు $ 88 డాలర్ల వద్ద, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $ 95 డాలర్ల వద్ద ఉంది. భారతీయ చమురు కంపెనీల ప్రకారం ఈ రోజు (శనివారం) నవంబర్ 5 కూడా దేశంలో పెట్రోల్-డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు లేదు. ఢిల్లీ నుంచి ముంబై, కోల్‌కతా నుంచి చెన్నై వరకు అన్ని మెట్రోల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు (శనివారం) కూడా లీటర్ పెట్రోల్ రూ.96.72, డీజిల్ రూ.89.62గా ఉంది. మరోవైపు దేశ ఆర్థిక రాజధాని ముంబై గురించి మాట్లాడితే ఇక్కడ పెట్రోల్ లీటరుకు రూ. 106.31, డీజిల్ ధర లీటరుకు రూ. 94.27 వద్ద స్థిరంగా ఉంది. అంతేకాకుండా చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.106.03, డీజిల్ ధర రూ.92.76గా ఉంది.

పోర్ట్ బ్లెయిర్‌లో అతితక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ విక్రయిస్తున్నారు. లీటరు పెట్రోలు ధర రూ.84.10 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ.79.74గా ఉంది.
హైదరాబాద్ లో  లీటర్ పెట్రోల్ రూ.109.66, డీజిల్ రూ.97.82. బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ.101.94, డీజిల్ రూ.87.89. తిరువనంతపురంలో
 లీటర్ పెట్రోల్ ధర రూ.107.71, డీజిల్ ధర రూ.96.52.


 ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ఇంధన ధరలను సవరిస్తారు. రూపాయి నుండి US డాలర్ మారకం రేటు, ముడి చమురు ధర, ప్రపంచ సంకేతాలు, ఇంధన డిమాండ్ మొదలైన చాలా అంశాలు పెట్రోల్ డీజిల్  ధరలను నిర్ణయిస్తాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినప్పుడు, భారతదేశంలో ఇంధన ధరలు పెరుగుతాయి. 

పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్ ఇతర జోడించిన తర్వాత దాని ధర దాదాపు రెట్టింపు అవుతుంది. విదేశీ మారకపు ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ఆధారంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజూ మారుతూ ఉంటాయి.  

click me!