తన కాఫీ రుచితో యావత్ ప్రపంచానికి ఒక బ్రాండ్ గా నిలిచిన స్టార్ బక్స్ యజమాని, ఓ సాధారణ కాకా హోటల్లో కాఫీ తాగితే ఉంటుంది. కాస్త విడ్డూరంగానే ఉంది. కానీ ఈ విడ్డూరం నిజంగానే చోటు చేసుకుంది. బెంగుళూరులో అని సుప్రసిద్ధ విద్యార్ధి భవన్ హోటల్ లో స్టార్ బక్స్ యజమాని ఫిల్టర్ కాఫీ తాగుతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది
గార్డెన్ సిటీ అంటే గుర్తొచ్చేది బెంగళూరు, ఇక్కడే దేశంలోనే అత్యుత్తమ ఫిల్టర్ కాఫీ సైతం తాగవచ్చు. బెంగళూరులోని బసవనగుడి సమీపంలోని విద్యార్థి భవన్ అంటే ఇక్కడి ఫిల్టర్ కాఫీ చాలా ఫేమస్, బెంగుళూరు వాసులతో పాటు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చి బెంగళూరులో స్థిరపడిన వారు కూడా ఈ సూపర్ ఫిల్టర్ కాఫీ తాగుతారు. బెంగుళూరులో చాలా ప్రసిద్ధి చెందిన ఈ హోటల్ ఈ రోజు వార్తల్లో నిలిచింది. ఎందుకు ప్రపంచంలోనే అతిపెద్ద కాఫీ కంపెనీ అయిన స్టార్‌బక్స్ సహ వ్యవస్థాపకుడు జెవ్ సీగెల్ ఇక్కడ కాఫీ తాగారు.
స్టార్ బక్స్ కాఫీ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరుంది. దాదాపు వందకు పైగా దేశాల్లో స్టార్ బక్స్ కాఫీ షాప్స్ ఉన్నాయి. అలాంటి సంస్థ యజమాని, బెంగుళూరులోని ఓ సాధారణ కాఫీ హోటల్ లో ఫిల్టర్ కాఫీ తాగేందుకు వచ్చారంటే మామూలు విషయం కాదని, విద్యార్థి భవన్ హోటల్ యాజమాన్యం స్వయంగా ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
undefined
నిజానికి బెంగళూరులోని విద్యార్థి భవన్ స్టార్‌బక్స్ కంటే పాత సంస్థ. 1943లో స్థాపించబడిన విద్యార్థి భవన్ బెంగళూరులోని పురాతన రెస్టారెంట్. ఇక్కడి కాఫీ సువాసన అదుర్స్ అనే చెప్పాలి. విద్యార్థి భవన్ దేశానికి స్వాతంత్రం రాకముందు నుండి రుచికరమైన దోసె, ఇడ్లీ వడ, ఫిల్టర్ కాఫీకి ప్రసిద్ధి చెందింది. అందుకే ఇది స్టార్‌బక్స్ కంటే పురాతనమైన సంస్థ. రద్దీగా ఉండే గాంధీ బజార్ లో ఈ విద్యార్థి భవన్ హోటల్ మసాలా దోసె, ఫిల్టర్ కాఫీతో అందరినీ ఆకర్షిస్తుంది.
ఇదిలా ఉంటే స్టార్‌బక్స్ సహ వ్యవస్థాపకుడు జెవ్ సీగల్ బెంగళూరులోని విద్యార్థి భవన్ లో మసాలా దోసను ఆస్వాదిస్తూ కాఫీ సిప్ చేస్తూ ఫోటోలో చూడవచ్చు. విద్యార్థి భవన్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో, 'స్టార్‌బక్స్ సహ వ్యవస్థాపకుడు జెవ్ సీగెల్ ఈ సాయంత్రం విద్యార్థి భవన్‌కు రావడం మాకు సంతోషంగా, గర్వంగా ఉంది. విద్యార్థి భవన్‌లో మా మసాలా దోసె, కాఫీ రుచి చూశారు. మా గెస్ట్ బుక్ లో కూడా తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. అని తమ సంతోషాన్ని వెల్లిబుచ్చారు.
ఇదిలా ఉంటే జెఫ్ ఒక అమెరికన్ వ్యాపారవేత్త, అతను 1971లో స్టార్‌బక్స్‌ను స్థాపించాడు. స్టార్‌బక్స్ వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్‌గా పనిచేశాడు.
స్టార్‌బక్స్ రానివ్వండి, కాఫీ డే ఉండనివ్వండి, పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటళ్లు తెరవనివ్వండి. కానీ స్థానికంగా ఉండే చిన్న చిన్న హోటళ్లు, రెస్టారెంట్లలో లభించే ఆహారం, కాఫీ, స్నాక్స్ రుచి ఈ పెద్ద సంస్థల్లో దొరకదు. ఇప్పటికీ తమ వైవిధ్యమైన అభిరుచితో వినియోగదారులను ఆకర్షిస్తూ నిత్యం రద్దీగా ఉండే ఆయా పట్టణాల్లోని కొన్ని చిన్న చిన్న హోటళ్లే ఇందుకు నిదర్శనం.