కరోనా వైరస్ దెబ్బతో ఐఫోన్ల తయారీ ఆపేసి మాస్కులు తయారు చేస్తున్నారు...

By Sandra Ashok KumarFirst Published Feb 8, 2020, 12:55 PM IST
Highlights

ప్రముఖ స్మార్ట్ ఫోన్ ఐఫోన్లను తయారుచేసే ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఫాక్స్‌కాన్ ఇప్పుడు కరోన వైరస్ మాస్క్‌లు తయారు చేస్తోంది.చైనాలో ప్రారంభమయిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలనే వనికిస్తుంది. ఈ కరోన వైరస్ ఇప్పటికే వేలాది మంది  సోకింది ఇంకా వందల మంది దీని బారిన పడి మృతి చెందారు.

ప్రపంచ వ్యాప్తంగా ప్రజలని  భయపెడుతున్న కరోనా వైరస్ దేశ విదేశాలకు ఇది ఇంకా వ్యాప్తి చెందుతుంది. చైనాలో ప్రారంభమయిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలనే వనికిస్తుంది. ఈ కరోన వైరస్ ఇప్పటికే వేలాది మంది  సోకింది ఇంకా వందల మంది దీని బారిన పడి మృతి చెందారు. చైనా నుండి పక్క దేశాలకు కూడా ఇది పాకుతుంది.

ఒక్క చైనా లోనే కొన్ని వేల  కరోన వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ కారణంగా అన్నీ దేశాలు ముందస్తుగా జాగ్రత్త పడుతున్నాయి. చైనా నుంచి వచ్చే వారిని ఆపేస్తున్నారు. ఈ వైరస్ మరింతగా వ్యాపించకుండా ప్రభుత్వలు చర్యలు తిసుకుంటున్నాయి. అయితే  ప్రముఖ స్మార్ట్ ఫోన్ ఐఫోన్లను తయారుచేసే ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఫాక్స్‌కాన్   ప్రజల కారణంగా ఆపేసిన తమ రోజువారీ ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి పునఃప్రారంభించడానికి అనుమతులివ్వాలంటూ ఇప్పుడు ఆ సంస్థ ఒత్తిడి చేస్తోంది.

also read ప్రభుత్వ ఉద్యోగులకు చేదు వార్తా... రెండో శనివారం రద్దు...

కరోనా వైరస్  సొకకుండా ఉండేందుకు చైనాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మాస్కులకు కొరత ఏర్పడింది. దీంతో మాస్కుల ఉత్పత్తిని ఫాక్స్‌కాన్ మొదలుపెట్టింది. ఈ నెల చివరి నాటికి రోజుకు 20 లక్షల మాస్కులను తయారుచేయాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఒకరి నుండి మరొకరికి కరోనా వైరస్ వ్యాపించకుండా ఈ మాస్కుల ఉపయోగపడతాయి.

సోషల్ మీడియా ప్లాట్‌ఫాం విచాట్‌లో ఆ సంస్థ 'ఈ అంటువ్యాధిపై పోరాటంలో ప్రతి సెకనూ విలువైనదే' అని ఒక పోస్ట్ చేసింది.''ఎంత వేగంగా నివారణ చర్యలు తీసుకుంటే, ఈ వైరస్‌ను అరికడితే అలాగే ఈ వైరస్ వల్ల ప్రాణాలను కాపాడితే అంత త్వరలో మనం దీనిపై విజయం సాధిస్తాం'' అని ఆ కంపెనీ పేర్కొంది.

ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థయిన ఫాక్స్‌కాన్ ఐఫోన్లనే కాకుండా ఐపాడ్‌లు, అమెజాన్ కిండిల్, ప్లే స్టేషన్ వంటి అనేక ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలనూ తయారుచేస్తుంది.దక్షిణ చైనాలోని షెంజెన్ నగరంలో ఉన్న మెయిన్ ఫ్యాక్టరీలో ఇప్పటికే ప్రయోగాత్మకంగా మాస్కుల తయారీ మొదలుపెట్టినట్లు ఫాక్స్‌కాన్ వెల్లడించింది. మేం చేస్తున్నది ఫాక్స్‌కాన్ కార్పొరేట్ బాధ్యత నెరవేర్చడానికి మాత్రమే కాదు సామాజిక బాధ్యతగా ఈ పని చేస్తున్నామని ఆ సంస్థ పేర్కొంది.

ప్రస్తుతం తమ సంస్థకు చెందిన కార్మికులు, ఉద్యోగులకు మాస్కులు సరఫరా చేస్తున్న ఫాక్స్‌కాన్ పూర్తిస్థాయి ఉత్పత్తి ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తేనున్నట్లు చెప్పింది.మా కంపెనీ ఉద్యోగుల్లో ఎవరికైనా కరోనా వైరస్ సోకిందా అన్నది తెలుసుకునేందుకు ఇన్‌ఫ్రారెడ్ టెంపరేచర్ మెజర్‌మెంట్ ఎక్విప్‌మెంట్ ఉపయోగిస్తున్నట్లు ఫాక్స్‌కాన్ తెలిపింది.

also read ఇక పీఎఫ్ పైన పన్ను...రూ.7.5 లక్షలు దాటిందా? బాదుడే ?!

కరోనా వైరస్ ప్రబలిన వెంటనే ఫాక్స్‌కాన్ తన యూనిట్లలో కార్యకలాపాలను నిలిపివేసింది. అయితే, గతంలో సెలవు దినాల్లోనూ తన కంపెనీలో ఉత్పత్తి కొనసాగించిన ఫాక్స్‌కాన్ ఇప్పుడిలా మూసివేసిన ప్లాంట్లను తెరవడానికి అనుమతులివ్వాలంటూ అధికారులను కోరుతోంది.చైనాలో కంపెనీల మూసివేత, ప్రయాణాలపై ఆంక్షలు వంటివి ప్రపంచవ్యాప్తంగా వస్తువుల సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఆందోళనల నేపథ్యంలో ఫాక్స్‌కాన్ ఈ మేరకు కోరుతోంది.

 ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల షిప్‌మెంట్ 10 శాతం తగ్గుతుందని ఐఫోన్లు, ముఖ్యంగా ఐఫోన్ 11 కొరత ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.మరోవైపు సర్జికల్ మాస్కుల కొరతను తగ్గించడానికి అమెరికా కార్ల తయారీ సంస్థ జనరల్ మోటార్స్ కూడా ముందుకొచ్చింది. చైనాలోని ఆ సంస్థ జాయింట్ వెంచర్ ఎస్‌ఏఐసీ-జీఎం వూలింగ్ రోజుకు 17 లక్షల మాస్కులు తయారుచేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ కరోన వైరస్ అన్నీ దేశలో వ్యాప్తి చెందుతుంది అలాగే కొన్ని వైరస్ సోకిన కేసులు కూడా నమోదయ్యాయి.

click me!