FlipKart: ఫ్లిప్‌కార్ట్ కు షాక్ ఇచ్చిన CCPA..కస్టమర్లకు క్వాలిటీ లేని ప్రెజర్ కుక్కర్లు అమ్మినందుకు పెనాల్టీ

By Krishna AdithyaFirst Published Aug 17, 2022, 8:35 PM IST
Highlights

సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) ఫ్లిప్‌కార్ట్‌ 1 లక్ష రూపాయల పెనాల్టీ విధిస్తున్నట్లు తీర్పు ఇఛ్చింది. మార్కెట్లోని నాణ్యతలేని ప్రెషర్ కుక్కర్లు కస్టమర్లకు విక్రయిస్తోందని, అందుకే వాటన్నింటినీ రీకాల్ చేసి, వినియోగదారులకు తిరిగి డబ్బులు వాపసు ఇవ్వాలని CCPA  ఫ్లిప్ కార్ట్  కంపెనీని ఆదేశించింది.

సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) ఫ్లిప్‌కార్ట్‌ షాక్ ఇచ్చింది. సరైన క్వాలిటీ ప్రమాణాలు పాటించకుండానే ప్రెజర్ కుక్కర్ల సేల్స్ అనుమతించినందుకు గానూ 1 లక్ష రూపాయల పెనాల్టీ విధిస్తున్నట్లు సీసీపీఏ తీర్పు ఇఛ్చింది. అంతేకాదు మార్కెట్లోని నాణ్యతలేని కంపెనీ ప్రెషర్ కుక్కర్లు అన్నింటినీ రీకాల్ చేసి, వినియోగదారులకు తిరిగి డబ్బులు వాపసు ఇవ్వాలని CCPA  ఫ్లిప్ కార్ట్  కంపెనీని ఆదేశించింది.

నిజానికి డొమెస్టిక్ ప్రెజర్ కుక్కర్ (క్వాలిటీ కంట్రోల్) IS 2347:2017 ప్రకారం భద్రతా ప్రమాణాలను పాటించాలని సంబంధిత మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ  ఉత్తర్వులు ఫిబ్రవరి 1, 2021నుంచి అమల్లోకి వచ్చాయి. CCPA ఫ్లిప్‌కార్ట్ తన ప్లాట్‌ఫారమ్‌లో విక్రయించిన మొత్తం 598 ప్రెషర్ కుక్కర్‌ల గురించి సమాచారాన్ని వినియోగదారులకు తెలియజేయాలని, అలాగే కుక్కర్లు అన్నింటినీ వెనక్కి తీసుకుని, వాటికి డబ్బులను తిరిగి వినియోగదారులకు వాపసు ఇవ్వాలని. అంతేకాదు దీనిపై 45 రోజుల్లో నివేదికను సమర్పించాలని ఆదేశించింది.

లైవ్ మింట్ వార్త ప్రకారం, కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ఇలా పేర్కొంది, “ఫ్లిప్ కార్ట్ తన ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో భద్రతా ప్రమాణాలు పాటించని, ప్రెజర్ కుక్కర్‌లను విక్రయించిందని,  అందుకే వినియోగదారుల హక్కులను పరిగణలోకి తీసుకొని ఈ చర్య తీసుకున్నట్లు ప్రకటించింది.  

ఫ్లిప్‌కార్ట్ తన ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో ఇటువంటి ప్రెషర్ కుక్కర్‌లను విక్రయించడం ద్వారా మొత్తం రూ.1,84,263 రెవెన్యూను ఆర్జించిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సోదాల్లో భద్రతా ప్రమాణాలు లేని  హెల్మెట్‌లు, ప్రెషర్ కుక్కర్‌లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం అందింది.

ప్రమాణాలు  లేని 1088 హెల్మెట్లు కనుగొన్నట్లు ప్రకటన...
ప్రమాణాలకు అనుగుణంగా లేని 1,435 ప్రెషర్ కుక్కర్లు, 1,088 హెల్మెట్‌లను బిఐఎస్ జప్తు చేసింది. CCPA అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు కూడా చట్ట ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన తప్పనిసరి ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూడాలని కోరింది.

అంతేకాకుండా, BIS చట్టం, 2016లోని నిబంధనల ప్రకారం నిర్దేశించిన ప్రమాణాలను ఉల్లంఘించిన నేరాలను తక్షణమే గుర్తించాలని BIS అన్ని ప్రాంతీయ శాఖలకు సక్రమంగా తెలియజేయాలని CCPA డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS)కి కూడా లేఖ రాసింది.

click me!